Telangana State Formation Day: Telangana Won But TRS Lost

నేడు తెలంగాణ ఆవిర్భావదినోత్సవం సందర్భంగా అటు ఏపీ ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ సైతం తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అలాగే ఇటు తెలంగాణ ప్రభుత్వం, బిఆర్ఎస్, బీజేపీ, కవిత జాగృతి కూడా తమ రాష్ట్ర ఆవిర్భావదినోత్సవానికి తమ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

అయితే ఇక్కడ తెలంగాణ సాధనే లక్ష్యంగా ఉద్యమ రూపంలో ఉవ్వెత్తున ఎగిసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు తెలంగాణలో కనుమరుగయ్యింది. కేసీఆర్ ఉద్యమాల ఫలితమే, తెరాస పోరాటాల పుణ్యమే తెలంగాణ అంటూ చెప్పుకున్న గులాబీ దండు ఇప్పుడు తమ పార్టీ పేరు మార్పుతో తెలంగాణలో ఉనికి కోల్పోయింది.

Also Read – ‘పోరు’ బాటలు కాదు ‘ప్రతీకార’ చర్యలే…

ఈ పదకుండేళ్ళ తెలంగాణ ప్రస్థానంలో తెలంగాణ ఎన్నో రంగాలలో ప్రగతిని సాధించింది, అభివృద్ధికి నోచుకుంది, హైద్రాబాద్ అనే తెలంగాణ ఆస్తిని, గౌరవాన్ని రెట్టింపు చేసుకుంది. కానీ ఇక్కడ ప్రత్యేక రాష్ట్ర సాధనతో తెలంగాణ గెలిచింది కానీ తెరాస ఓడిందనే చెప్పాలి.

2023 ఎన్నికలకు ముందే తెరాస బిఆర్ఎస్ గా రూపాంతరం చెందడంతో తెలంగాణలో తెరాస శకం ముగిసినట్లయింది. ఇక బిఆర్ఎస్ గా మొదలైన కేసీఆర్ గులాబీ కారు ప్రయాణం ఓటమితో తన తొలి అడుగు వేస్తే, ఇప్పుడు పార్టీలో సొంత వారి మధ్యే రాజకీయ విభేదాలతో అల్లాడుతోంది.

Also Read – బనకచర్లలో పారే నీళ్ళకంటే రాజకీయాలే ఎక్కువ?

తెలంగాణ పదకుండేళ్ళ ప్రస్థానం, తెరాస ప్రభుత్వ పదేళ్ళ ప్రయాణం తో తెలంగాణలో అభివృద్ధి ఎలా అయితే కంటికి కనిపిస్తుందో, అలాగే బిఆర్ఎస్ అవినీతి కూడా చెవులకు వినిపిస్తుంది.




ఇక నాడు ఉద్యమ నాయకుడిగా పోరాటానికి ముందుండి నడిపిన కేసీఆర్ ఇప్పుడు తన పార్టీ ఓటమితో, తన సంతానం మధ్య ఏర్పడిన రాజకీయ విభేదాలతో ప్రజలకు ముఖం చాటేసే పరిస్థితులను ఎదుర్కుంటున్నారు.

Also Read – అప్పుడు కేసీఆర్‌, ఇప్పుడు కవిత… వాడేసుకుంటున్నారుగా!