తెలంగాణకి గొడవలు – ఏపీకి నీళ్లు ..?

Telangana Andhra Politics

ప్రత్యేక రాష్ట్ర సాధన అంటూ ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ ఇప్పటికి అదే ప్రాంతీయవాద రాజకీయ రొచ్చులో కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్ర విభజన తో ఏపీ ఆర్థికంగా పాతాళానికి పడినా,

రాజధాని లేని రాష్ట్రమంటూ ఇంటా బయటా ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, తెలంగాణలో డబుల్ రోడ్లు – ఏపీలో గుంతల రహదారులు అంటూ ఎన్ని హేళలను మోసినా ఎన్నడూ ఆంధ్రప్రదేశ్ రాజకీయం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోలేదు, అక్కడి ప్రాజెక్టులను ఆపలేదు, అలాగే అక్కడి ప్రభుత్వాలను ఆ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టలేదు, దూషణ చేయలేదు.

ADVERTISEMENT

కానీ ఉద్యమాలతో అనుకున్న లక్ష్యాలను అందుకున్న తెలంగాణ రాజకీయం మాత్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దశాబ్దం గడిపిచిపోయినా ఇప్పటికి ఆంధ్రోళ్ల పెత్తనం అవసరమా.? ఆంధ్రా నాయకుల దగ్గర ఊడిగం చేస్తున్నారా.? అంటూ నిత్యం ఆంధ్రా టార్గెట్ గా ముందుకెళ్తుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కులను హరిస్తుంది, ఇక్కడి ప్రజలకు అన్యాయం చేస్తూ అక్కడ ప్రాజెక్టులు నిర్మిస్తుంది అంటూ పొద్దున్న లేస్తుంది మొదలు రాత్రి పడుకునేవరకు ఇదే పంచాయితీ తో రెండు రాష్ట్రాల మధ్య ఆరిపోయిన చిచ్చుకి తిరిగి నీళ్లతో నిప్పు పెడుతున్నారు.

చంద్రబాబు ని తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించడం, టీడీపీ పార్టీని తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబెట్టడమే బిఆర్ఎస్ రాజకీయం అనేలా బిఆర్ఎస్ అవసరం లేని చోట కూడా రాజకీయం చేస్తూ ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇక్కడి ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలను సృష్టిస్తుంది.

అలాగే ఆ ఊబిలోకి అధికార కాంగ్రెస్ ను సైతం రెచ్చకొట్టి మరి లాగుతుంది. అయితే ఇన్నాళ్లు తెలంగాణ పార్టీల నుంచి వచ్చే విమర్శలను చాల లైట్ తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా టీడీపీ తాజాగా ఏపీ తరువు వాదనలను చాల బలంగా ప్రజల ముందుకు తెస్తుంది.

అలాగే తెలంగాణ నేతల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు, వారి నుంచి ఎదుర్కుంటున్న ఆరోపణలకు, విమర్శలకు గట్టి బదులు చెపుతూ అసలు వాస్తవాలను వివరించేందుకు ముఖ్యమంత్రి బాబు మొదలుకుని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వరకు మీడియా ముందుకొస్తున్నారు.

ఇందులో భాగంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ తెలంగాణ రాజకీయ పార్టీల నేతలు రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా వారి రాజకీయ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నారని, వాళ్ళకి కావాల్సింది ఇరు రాష్ట్రాల మధ్య నీళ్ల గొడవలు, ప్రాంతీయవాద రగడలే కానీ ఏపీకి కావాల్సింది నీళ్లు తద్వారా ఇక్కడ జరిగే అభివృద్ధి మాత్రమే అంటూ పూర్తి స్పష్ట ఇచ్చారు.

ADVERTISEMENT
Latest Stories