ఈ నెల 26 న ఓటిటిలో రెండు కొత్త సినిమాలు సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. ఒకటి సిద్దు జొన్నల గడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన డీజే టిల్లు స్క్వేర్, మరొకటి విజయ్ దేవర కొండ, మృణాల్ ఠాగూర్ నటించిన ది ఫామిలీ స్టార్.
Also Read – మేమూ డైరీలు రాసుకుంటున్నామోచ్!
యూత్ కామెడీ ఎంటర్టైనెర్ గా వచ్చిన డీజే టిల్లు స్క్వేర్ వెండి తెర మీద 100 కోట్లకు పైగా కలెక్షన్లు వసూళ్లు చేసి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ మూవీ ఓటిటి హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంత చేసుకోవడంతో రేపటి నుంచి తెలుగుతో పాటు మిగిలిన అన్ని భాషలలోను ఈ మూవీ ని అందుబాటులో ఉంచనున్నట్లు సదరు సంస్థ యాజమాన్యం ప్రకటించింది.
థియేటర్లలో పెద్ద సౌండే చేసిన ఈ టిల్లు, రాధిక,లిల్లీ డీజే ఓటిటి ఫ్లాట్ ఫామ్ పై కూడా అదే స్థాయి మోత మోగించడానికి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. అలాగే ది ఫామిలీ స్టార్ గా వచ్చిన విజయ్ థియేటర్లలో నిరుత్సహ పరిచినప్పటికీ ఓటిటిలో ఆకట్టుకోగలదనే ఆశతో ఉన్నారు.
Also Read – చిరంజీవికి గంజి పెట్టి ఇస్త్రీ చేయక తప్పదట!
రేపటి నుండి అమెజాన్ ప్రైమ్ ఫ్లాట్ ఫామ్ లో ది ఫామిలీ స్టార్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. డీజే టిల్లు తో స్టార్ బాయ్ టాగ్ ను సంపాదించుకున్న సిద్దు, రౌడీ బాయ్ గా విజయ్ ఇలా ఇద్దరి యంగ్ హీరోల సినిమాలు ఒకే రోజు ఓటిటి తెర మీద ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి పోటీపడబోతున్నాయి. దీనితో ఈ సమ్మర్ హాలిడేస్ లో ఓటిటి ప్రేక్షకులకు డబుల్ ధమాకా దొరికినట్లయింది.