ఇవాళ్ళ అదివారం ఇంచుమించు ఒకే సమయంలో రెండు ఆసక్తికరమైన వీడియోలు సోషల్ మీడియాలో వచ్చాయి.
ఒకటి..హిల్టన్ హోటల్లో ట్రంప్‌తో సహా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, వందల మంది అతిధులు పాల్గొంటున్న వైట్‌హౌస్ కరస్పాండెంకట్స్ డిన్నర్ మీటింగ్‌లో ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపినప్పుడు, భద్రతా సిబ్బంది ట్రంప్‌తో సహా ప్రముఖులను అక్కడి నుంచి భద్రంగా బయటకు తరలిస్తున్న వీడియో.
రెండోది… నేడు జగన్ దంపతులు శనివారం రాత్రి బెంగళూరు నుంచి యూరప్ పర్యటనకు బయలుదేరుతున్నప్పుడు, విమానాశ్రయంలో సుమారు రెండు డజన్ల మంది భద్రతా సిబ్బంది వారికి రక్షణగా లోనికి తోడ్కొని తీసుకువెళుతున్నప్పుడు తీసిన వీడియో.
ట్రంప్ అంటే ఈ ప్రపంచాధి నేత అనుకోవచ్చు. కాదంటే అయన ఇరాన్ మీద యుద్ధానికి వెళ్ళకుండా ఆపగలిగేది ఈ ప్రపంచం.
అలాంటి వీవీవీఐపీతో పాటు అమెరికా రక్షణ, విదేశాంగశాఖల మంత్రులు, డజన్ల కొద్దీ వీవీవీఐపీలు లోపల ఉన్నప్పుడు చీమ కూడా లోనికి చొరబడలేదు… అని జనం అనుకుంటారు. కానీ ఓ వ్యక్తి తుపాకీతో జొరపడి కాల్పులు కూడా జరిపాడు.
దాంతో ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియాతో అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సమావేశం మద్యలో పారిపోవాల్సి వచ్చింది.
కానీ జగన్ దరిదాపులకు చీమ కూడా చేరకుండా భారీ భద్రతతో విమానం ఎక్కించారు మన భద్రతా సిబ్బంది.
అమెరికా వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. కాల్పుల శబ్దం వినబడగానే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు మెరుపు వేగంతో స్పందించి, అధ్యక్షుడు ట్రంప్‌ను రక్షణ కవచంలా చుట్టుముట్టారు.… pic.twitter.com/h6pc54zK9H
— ChotaNews App (@ChotaNewsApp) April 26, 2026




