Tuni Train Firing case

ముద్రగడ పద్మనాభ రెడ్డి కాపు రిజర్వేషన్స్ అంశంపై 2016, జనవరి 31న తునిలో బహిరంగ సభ నిర్వహించినప్పుడు, దానికి హాజరైనవారిలో కొందరు అటుగా వెళుతున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ని అడ్డుకొని తగులబెట్టారు.

రైల్వే పోలీసులు 41 మందిపై కేసు నమోదు చేసి విజయవాడ రైల్వే కోర్టులో దాఖలు చేయగా, ఆ కేసు విచారణ సరిగ్గా చేయకుండా కోర్టు ముందుకు వచ్చినందుకు చివాట్లు పెట్టింది. ఈ కేసు విచారణ సరిగ్గా చేయనందుకు ముగ్గురు రైల్వే పోలీస్ అధికారులని తీవ్రంగా మందలించింది కూడా. కేసు విచారణ సరిగ్గా చేయకుండా సరైన సాక్ష్యాధారాలు చూపనందుకు ఈ కేసుని 2016, మే 1న కొట్టివేస్తూ తీర్పు చెప్పింది.

Also Read – ప్యాలస్ లు కాదు పరిశ్రమలు కావాలి..!

రైల్వే కోర్టు తీర్పుని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దానిపై వైసీపీ సోషల్ మీడియా విమర్శలు మొదలుపెట్టేసింది.

నాడు జగన్‌ ఆ కేసులను ఎత్తివేస్తే చంద్రబాబు నాయుడు ఆ కేసులను తిరగదోడుతున్నారని విమర్శించింది. కాపులపై చంద్రబాబు నాయుడు కక్ష కట్టారని ఆరోపించింది.

Also Read – రేపు రెంటపాలకు జగన్‌.. ఏం ప్లాన్ చేశారో?

అయితే ఈ జీవో విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి రావడంతో ఆయన సంబందిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి జీవోని తక్షణం ఉప సంహరించాలని ఆదేశించారు.

తనకు సమాచారం ఇవ్వకుండా సున్నితమైన ఈ అంశంపై ఎవరు జీవో జారీ చేశారని ఆర్ఆ తీయగా, రైల్వే పోలీస్ శాఖలొ డివిజినల్ సెక్యూరిటీ కమీషనర్‌ సూచన మేరకు జీవో జారీ ఆయినట్లు సీఎంవో అధికారులు గుర్తించారు. సదరు అధికారుల వివరణ కోరినట్లు తెలుస్తోంది.
రైల్వేకోర్టు తీర్పుని హైకోర్టులో సవాలు చేయాలని ఆదేశిస్తూ వెలువడిన జీవోని ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఈరోజే మరో జీవో జారీ చేయనుంది.

Also Read – వైఎస్ స్పూర్తి.. వద్దు పైనున్న ఆయన బాధపడతారు!

కానీ కూటమిలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. కనుక ఈ జీవో విడుదల వెనుక దాని హస్తం ఏమైనా ఉందా? అని అనుమానించాల్సి వస్తోంది.




ఈ కేసుని కదపడం అంటే తేనె తుట్టెని కదపడమే అని సిఎం చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు, కనుకనే దాని జోలికి పోలేదు. కానీ ఆయనకు తెలియకుండా ఈ జీవో జారీ అయ్యిందంటే, తెర వెనుక ఏదో పెద్ద కుట్ర జరుగుతోందని అనుమానించక తప్పదు.