
ప్రముఖ యాంకర్, న్యూస్ రీడర్ స్వేచ్చ వొటార్కర్ (40) శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె అనేక న్యూస్ ఛానల్స్‌లో న్యూస్ రీడర్‌గా, డిజిటల్ కంటెంట్ క్రియేటర్, పలు రకాల కార్యక్రమాలకు యాంకర్‌గా పనిచేసి మీడియాలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు.
వృత్తిపరంగా విజయం సాధించిన స్వేచ్చ వొటార్కర్, వ్యక్తిగత జీవితంలో వైఫల్యం చెంది ఆత్మహత్య చేసుకోవడంతో సినీ, రాజకీయ, మీడియా రంగాలలో ఉన్నవారు షాక్ అవుతున్నారు.
Also Read – బీజేపీ వాదానికి మూడు పార్టీల మద్దతు…
ఆమె 5 ఏళ్ళ క్రితం భర్త నుంచి విడిపోయిన తర్వాత కుమార్తెతో కలిసి చిక్కడపల్లి వద్ద జవహార్ నగర్‌లో ఉంటున్నారు. పూర్ణ చందర్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నారు.
కనుక ఆమె జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను ధైర్యంగా అధిగమించి ముందుకు సాగుతూ తాను ఎంచుకున్న రంగంలో బాగా రాణించగలిగారని స్పష్టమవుతోంది.
Also Read – చంద్రబాబు-రేవంత్ సమావేశం వైసీపీ, బీఆర్ఎస్ జీర్ణించుకోగలవా?
కానీ జీవితంలో ఒడిదుడుకులను నిబ్బరంగా ఎదుర్కొని ఎంతగానో శ్రమించి ఎంచుకున్న రంగంలో రాణించినప్పటికీ ఎంతో ధైర్యవంతురాలుగా పేరున్న స్వేచ్చ వొటార్కర్ ఆత్మహత్య చేసుకోవడం మానవ సంబంధాలను ప్రశ్నిస్తున్నట్లే అనిపిస్తుంది.
సినీ పరిశ్రమలో తరచూ అనేక జంటలు విడిపోతుంటాయి. వారిలో పురుషులు చాలా తక్కువ సమయంలోనే మళ్ళీ పెళ్ళి చేసుకొని వైవాహిక జీవితం రీస్టార్ట్ చేసుకొని, వృత్తిపరంగా కూడా మళ్ళీ ముందుకు సాగిపోతుంటారు. కానీ విడాకుల తర్వాత వారి భాగస్వాముల పరిస్థితి దయనీయంగా మారుతుంటుంది లేదా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంటుంది.
Also Read – వైసీపీ లో ఆషాడం ఆఫర్..?
స్త్రీ-పురుషుల జీవితాలలో ఈ తేడాని చూస్తున్నప్పుడు నేటికీ సమాజంలో మహిళల పరిస్థితి మారలేదనిపిస్తుంది. ఇది చాలా బాధాకరమే. కానీ మహిళలు ఇటువంటి పరిస్థితులను శతాబ్ధాలుగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతూనే ఉన్నారు. వారి ఈ ధైర్యం, పోరాట స్పూర్తే మానవజాతిని కాపాడుతోందని చెప్పక తప్పదు.