చంద్రబాబుకి ఐ‌టి నోటీసువస్తే వైసీపీ హడావుడి దేనికి?టీవీ9 సూటి ప్రశ్న!

TV9-Rajinikanth-Perni-Naniప్రస్తుతం ఏపీలో మంత్రులందరూ హడావుడిగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ‘చంద్రబాబు నాయుడుకి ఐ‌టి నోటీసులు వచ్చాయని, ఆయన రూ.118 కోట్లు అవినీతికి పాల్పడ్డారని, త్వరలో జైలుకి వెళ్ళబోతున్నారనే’ మూడు ముక్కలు పట్టుకొని గ్రూప్ సాంగ్‌ పాడుతుండటం అందరూ వింటూనే ఉన్నారు.

“అయితే ఇదేమైనా జాతీయ సమస్యా? లేక వైసీపీ నేతలెవరికీ ఎప్పుడూ ఐ‌టి నోటీసులు రాలేదా?రాజకీయ నాయకులకు, వ్యాపారాలు చేసుకొనేవారికి ఏదో ఓ సమయంలో ఐ‌టి నోటీసులు వస్తూనే ఉంటాయి కదా?మరి వైసీపీ నేతలందరూ ఈ విషయాన్ని హైలైట్ చేసేందుకు ఎందుకు ఇంతగా ప్రయత్నిస్తున్నారు?” అంటూ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌ టీవీ9కు చెందిన రజనీకాంత్ మాజీ మంత్రి పేర్ని నానిని సూటిగా ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పేందుకు ఆయన తడబడ్డారు.

ADVERTISEMENT

“ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ముగ్గురూ కూడా ఇదేవిదంగా ప్రశ్నిస్తున్నారు. టీవీ9 రజనీకాంత్ కూడా వారితో కలిసిపోయారని అనుకోవాలా?” అంటూ ఒకటే ప్రశ్నను రెండు మూడుసార్లు అడుగుతూ, ఆలోగా రజనీకాంత్ అడిగిన ప్రశ్నకు సమాధానం కోసం సమయం సంపాదించుకొన్నారు.

“మాకు వారెవరితో సంబందం లేదు… మేము ప్రజల తరపున సూటిగా మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాము. దీనికి సమాధానం చెప్పండి,” అని రజనీకాంత్ అడిగినా పేర్ని నాని మళ్ళీ రెండుసార్లు అదే ఎదురుప్రశ్న వేశారు. అయితే ఆయన నుంచి దీనికి సమాధానం రాబట్టేందుకు, “పోనీ అలాగే అనుకోండి… ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి,” అని రజనీకాంత్ కార్నర్ చేసేసరికి పేర్నినాని ఇక తప్పించుకోలేకపోయారు.

కానీ రామోజీరావు, రాధాకృష్ణ, దగ్గుబాటి పురందేశ్వరిల ప్రస్తావన తెచ్చి కొన్ని నిమిషాలు సమయం సంపాదించుకోవడంతో, రజనీకాంత్ ప్రశ్నకు సమాధానం కూడా సిద్దం చేసుకొన్నారు.

పేర్ని నాని కాసేపు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ సంస్థలు, కుటుంబాలు, వారి ఆస్తులు, ఆర్ధిక లావాదేవీల గురించి మాట్లాడి, అవన్నీ వారి వ్యక్తిగతమని కనుక వాటిని తాము పట్టించుకోమన్నారు. వాళ్ళ తిప్పలు ఏవో వాళ్ళు పడతారని ఊరుకొంటామని కానీ అమరావతి నిర్మాణపనులలో అవినీతి జరిగిందని ఐ‌టి శాఖ చెపుతోంది కనుక మేము ప్రశ్నిస్తున్నాము,” అని సర్ధి చెప్పుకొన్నారు. అంటే దీని గురించి మాట్లాడుతున్న వైసీపీ నేతల వద్ద వారు చేస్తున్న ఆరోపణలకు ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని, ఓ ఊహాజనితమైన సమాచారం ఆధారంగా ఈ కధ అల్లి అందరూ కలిసి చంద్రబాబు నాయుడుని అప్రదిష్టపాలుచేసి, టిడిపిని రాజకీయంగా దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ADVERTISEMENT
Latest Stories