‘జగన్’ మృతి పట్ల ‘వైఎస్ జగన్’ సంతాపం!

typing-mistake-jayalilithaa-jagan-mahaa-tvఇటీవల కాలంలో కొన్ని మీడియా సంస్థలు చూపిస్తున్న అత్యుత్సాహంతో బ్రతికి ఉన్న వారినే నిర్ధాక్షిణ్యంగా చంపేస్తున్న వైనం చూస్తూనే ఉన్నాం. కమెడియన్ వేణుమాధవ్ వంటి అనేక మంది సినీ సెలబ్రిటీల విషయంలో గందరగోళం చెలరేగగా, తాజాగా జయలలిత మరణం విషయంలోనూ సంచలనం కోసం ముందస్తు వార్తలు ప్రసారం చేసి నాలుక కరచుకున్నాయి.

ఈ కధనాల పొరపాట్ల విషయం ఎలా ఉన్నా… ఒక్కోసారి అత్యుత్సాహంతో చేసే టైపింగ్ పొరపాట్లు కాసేపు నవ్వును పంచుతాయి. అయితే ఆ పొరపాట్ల వలన కొందరి మనోభావాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. తాజాగా జయలలిత మృతి సందర్భంగా అలాంటి పొరపాటే దొర్లింది. “జయలలిత మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం” అని టైప్ చేయబోయి, “జగన్ మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం” అని టైప్ చేయడం విశేషం.

ADVERTISEMENT

దీంతో సదరు ప్రసారాలకు సంబంధించి ఓ ఫోటోను క్లిక్ మనిపించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో… అది కాస్త వైరల్ అయ్యింది. బహుశా ఇతర నాయకులదైతే అంతగా ప్రాధాన్యత దక్కేది కాదేమో గానీ, ఇది ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ కు సంబంధించినది కావడంతో మరింతగా సందడి చేస్తోంది. చివరికి… సదరు మీడియా స్క్రోలింగ్ వలన… తన మృతికి తానే సంతాపం తెలుపుకోవాల్సి వచ్చింది.

ADVERTISEMENT
Latest Stories