మెగా వారసుడు రామ్ చరణ్ మరియు ప్రిన్స్ మహేష్ బాబులు కలిసి ఓ సారి ఫ్యామిలీ ట్రిప్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలు ఓ రేంజ్ లో హల్చల్ చేసాయి. ఈ ట్రిప్ గురించి ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రత్యేకంగా మాట్లాడారంటే దీనికున్న ప్రాముఖ్యతను అవగతం చేసుకోవచ్చు. అయితే ఆ ఫ్యామిలీ బాండింగ్ అక్కడితో ఆగలేదని, ప్రస్తుతం కూడా కొనసాగుతోందని ఈ ఫోటో చెప్పకనే చెప్తోంది.
మహేష్ బాబు తనయురాలు సితారతో కలిసి ఉన్న ఫోటోను రామ్ చరణ్ సతీమణి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది కాస్త వైరల్ అయ్యింది. ‘విత్ మై బెస్టీ సితార’ అంటూ పోస్ట్ చేసిన ఈ ఫోటోలో సితార ఎప్పటిలాగానే క్యూట్ క్యూట్ గా దర్శనమిస్తోంది. ట్విట్టర్ మరియు ఇంస్టాగ్రామ్ లలో ఈ ఫోటోకు వేల సంఖ్యలో ‘లైక్’లు వచ్చి పడుతున్నాయి. మెగా అండ్ ఘట్టమనేని ఫ్యామిలీ కలయిక అలాంటిది… అది మహేష్ అండ్ చెర్రీ అయినా… సితార అండ్ ఉపాసన అయినా..!



