ఒకప్పుడు సీబీఐ, ఈడీలంటే కేంద్రం పెంపుడు కుక్కలని, తమ రాజకీయ ప్రత్యర్ధులపైకి ఉసిగొలుపుతారని ఆరోపించిన జగన్, విజయసాయిరెడ్డిలు ఉన్నట్టుండి వాటిపై ఎక్కడ లేని నమ్మకం తెచ్చేసుకున్నారు. చంద్రబాబు అవినీతి పాలపడకపోవడం నిజం అయితే వారంలో తనపై తానే సీబీఐ విచారణ వేసుకోవాలంట.
వారం రోజులలో సీబీఐ విచారణ వేసుకోకపోతే చంద్రబాబు అవినీతి పరుడేనట. సీబీఐ నిజాలు నిగ్గుతేల్చేలా అయితే, వారు దాదాపుగా డజన్ కేసులలో జగన్, విజయసాయి రెడ్డిలపై వేసిన చార్జిషీట్లు నిజమే అనుకోవాలా? సీబీఐ చంద్రబాబు విషయంలో నిజాయితిగా జగన్ విషయంలో అన్యాయంగా ఉండదు కదా?
మరోవైపు చంద్రబాబును కోర్టు బోను ఎక్కించడానికి ప్రధానమంత్రిని ఎన్నిసార్లయినా కలుస్తా అని విజయసాయిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దీనికంటే వారిదగ్గర ఉన్న సాక్షాలతో వారే కోర్టు మెట్లు తొక్కొచ్చుగా? ఏదోరకంగా మనం ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్నాం కాబట్టి చంద్రబాబు మీద కూడా కేసులు వేసేస్తే అందరు ఒకటే జగన్ కు ఛాన్స్ ఎందుకు ఇవ్వకూడదు అని అనిపించుకోవాలనే తాపత్రయమా ఇది?



