వైసీపీ ఘోర ఓటమి తరువాత జగన్ చుట్టూ ఉన్న కోటరీ రాజకీయంతో ఇక వైసీపీ లో కొనసాగలేనని, రాజకీయాలకు వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి రైతు గా జీవితం కొనసాగిస్తానంటూ ప్రకటించి రాజకీయాలకు దూరంగా జరిగారు వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి.
అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో విజయ సాయి వైసీపీ మీద, ఆ పార్టీ అధినేత జగన్ మీద, కూడా విమర్శలు చేసారు. అలాగే జగన్ సైతం సాయి రెడ్డి మీద ప్రతివిమర్శలు చేసారు.
దీనితో విజయ సాయి పూర్తిగా వైసీపీ కి దూరమై పోయారని, వైసీపీ లిక్కర్ కేసులో అప్రూవర్ గా మారిపోయి వైసీపీ రాజకీయ పునాదులను కదల్చబోతున్నారంటూ కొన్ని మీడియాలలో కథనాలు కూడా వచ్చేసాయి.
కట్ చేస్తే, తాజాగా విజయ సాయి తన సోషల్ మీడియా వేదికగా రాజధాని అమరావతి మీద పెట్టిన పోస్టు తో ఆయన ఇప్పటికి వైసీపీ డీఎన్ఏ తోనే పనిచేస్తున్నారని, ఆయన దూరమయ్యింది కేవలం రాజకీయాలకు మాత్రమే కానీ వైసీపీ విధానాలకు కాదని స్పష్టమయింది.
వైసీపీ ని వీడినా సాయి రెడ్డి కి ఇంకా అమరావతి మీద అక్కసు మాత్రం అలానే ఉన్నట్టుండి. అప్పులు చేసి అమరావతిలో అద్భుతాలు సృష్టించనేలా .? ముందుగా అసెంబ్లీ, సచివాలయం, హై కోర్ట్ భవనాలు నిర్మిస్తే ఆ తరువాత అమరావతి దానంతట అదే అభివృద్ధి చెందుతుందని,
అలాకాకుండా భారీ డిజన్ల కోసం ప్రజా ధనాన్ని అనవసరంగా వృధా చేయడం కూటమి ప్రభుత్వానికి తగదు అంటూ వైసీపీ రాగానికి పల్లవి పాడారు సాయి రెడ్డి. అలాగే ఇక జగన్ మావిగన్ ప్రకటనకు కూడా వైసీపీ శ్రేణుల మాదిరి రేపోమాపో సాయి రెడ్డి కూడా వంత పాడడం ఖాయంగా కనిపిస్తుంది.
అసలు వైసీపీ లాంటి రాజకీయ పార్టీ, జగన్ లాంటి నాయకుడు, ఆయన ఆదేశాలను గుడ్డిగా ఆచరించే వైసీపీ శ్రేణులు ఉన్నంత కాలం అమరావతి ఎప్పుడు ఎదో ఒక రూపంలో వివాదాలను ఎదుర్కోవాల్సిందేనా.? ఎప్పుడు ఏదోఒక రాజకీయ నిందను మోయాల్సిందేనా.? ఎప్పటికప్పుడు రాజధాని అమరావతే అని నిరూపించుకోవాల్సిందేనా.?
రాజధానిగా అమరావతి చట్టబద్దత లభించినప్పటికీ, దేశం మొత్తం ఏపీ రాజధాని అమరావతి అంటూ పార్లమెంట్ సాక్షిగా తమ ఆమోద ముద్ర వేసినప్పటికీ వైసీపీ ఇప్పటికి అమరావతి పై తన నీలి విషాన్ని చిమ్ముతూనే ఉంది. రాష్ట్ర రాజధాని పేరు పై ఇంకా పలు రకాల రాజకీయాలు నడిపిస్తూనే వస్తుంది.
ఇందుకు వైసీపీ అరాచకారం ఒక కారణం అయితే కూటమి మెతకతనం మరో కారణంగా కనిపిస్తుంది. బీజేపీ అధిస్టానం ముందుకొచ్చి అమరావతి మీద విష ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ సంకేతాలు ఇస్తే తప్ప వైసీపీ, వైసీపీ ముసుగులో ఉన్న సాయి రెడ్డి లాంటి నేతల నోటికి తాళం పడేలా కనిపించడం లేదు.




