అధికారం అడ్డం పెట్టుకుని చేయని దుర్మార్గం లేదనే విధంగా, గత అయిదేళ్ళ వైసీపీ నేతల అవశేషాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోన్న దరిమిలా, వాటికి బదులు ఇచ్చుకోలేక, సంబంధం లేని విషయాలలో ప్రతిస్పందిస్తున్నారు.
తనపై వచ్చిన అక్రమ సంబంధం ఆరోపణల విషయంలో ఇప్పటివరకు ఓ సముచితమైన జవాబు ఇవ్వని విజయసాయిరెడ్డి, తాజాగా ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించిందని పెద్దఎత్తున మండిపడుతున్నారు.
మద్యం ధరలను తగ్గించడం ద్వారా ప్రజలు మద్యానికి బానిస అయిపోతారని, గృహహింస పెరిగిపోతుందని, అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతాయని… ఇలా తమ పార్టీ నేతలు సహజంగా చేసేవన్నీ ప్రజలకు ఆపాదించే ప్రయత్నం చేశారు.
అయిదేళ్ళ పాటు కల్తీ మద్యాన్ని ప్రజలకు అందించి, ఎంతోమంది ఆడపడుచుల అయిదోతనాన్ని దోచుకున్న ప్రభుత్వంగా కీర్తిని అందుకున్న వైసీపీ సర్కార్, నేడు మద్యం ధరలపై గగ్గోలు పెట్టడం శోచనీయమే.
వైసీపీ సర్కార్ ఇచ్చిన కల్తీ మద్యం వలన వందలాది మంది చనిపోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడగా, విశాఖ వేదికగా విజయసాయిరెడ్డి చేసిన భూకబ్జాలు, గంజాయి సరఫరాల లెక్కలైతే ఊహాలకందనివి.
భారీ స్థాయిలో పెంచిన మద్యం ధరలను తగ్గించి, నాణ్యమైన మద్యాన్ని కూడా అందివ్వని ‘జగన్ అండ్ కో’ చర్యలను నిలువరించి, మద్యం ధరలను అందుబాటులోకి తీసుకువస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలుపరిచే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
నిజానికి మద్యం ధరలను తగ్గించడం వలన ప్రభుత్వానికే పెద్ద ఎత్తున ఆదాయం గండికొడుతుంది. అయినప్పటికీ ఇచ్చిన వాగ్ధానానికి కట్టుబడి నాణ్యమైన మద్యాన్ని అందుబాటు ధరలలో అందించే విధంగా పాలసీని రూపొందించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.
అయినా ఇలాంటి విజయసాయిరెడ్డి ప్రవచనాలకు కొదవేమీ ఉండదు. ఈయన గారి సూక్తులు వింటే… వెనుకటికొకరు చెప్పిన సామెత “చెప్పేవి సీరంగి నీతులు… చేసేవి …..” మాదిరి ఉంటాయి.




