జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిజనిర్ధారణ కమిటీ నివేదిక బయట పెట్టిన అనంతరం ద్రోహం చేసింది అని తేలిన బీజేపీ కంటే తెలుగు దేశం ప్రభుత్వాన్నే ఎక్కువ విమర్శించారు. అయినా ప్రతిపక్ష వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి గురి కుదరనట్టు ఉందో లేక బీజేపీని ఆ కమిటీ తప్పు పట్టడం నచ్చలేదో తెలీదు కానీ, జనసేన కమిటీ పై విమర్శలు కురిపించారు విజయసాయిరెడ్డి.
“జనసేన కమిటీలో అందరు పెయిడ్ ఆర్టిస్టులే. వారికి ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడు,” అని అభివర్ణించారు ఆయన. మాజీ న్యాయమూర్తి గోపాల గౌడ, మాజీ ఐఏఎస్ పద్మనాభయ్య, జేపీలను కూడా అనుమానిస్తున్నారా విజయసాయి రెడ్డి? వాళ్ళను పక్కన పెడితే దాదాపుగా సొంత మనుషులు లాంటి ఉండవల్లి, ఐవైఆర్ కృష్ణారావులను కూడా శంకిస్తే ఎలా?
తెల్లారితే వారు ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రభుత్వంపై కేసులు వెయ్యడమే కదా చేసేది? ఇంకొక సభ్యుడు తోట చంద్రశేఖర్ ఏకంగా వైకాపా సభ్యుడే. ఇప్పుడు క్రియాశీలంగా ఉన్నారో లేదో తెలియదు గానీ. కొంపతీసి జగన్, విజయసాయిరెడ్డిలను మెంబర్లుగా కమిటీ వెయ్యాలని కోరుకుంటున్నారా ఏంటి?



