ప్రధానిని ఎందుకు కలుస్తున్నారో చెప్పిన విజయసాయిరెడ్డి

Vijaya -sai Reddy explains why he met narendra modiవైకాపా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఉంటే ఎక్కవ సార్లు పీఎంవో చుట్టూ తిరుగుతుంటారని టీడీపీ వర్గాలు చెబుతుంటాయి. టీడీపీని వదిలించుకుని వైసీపీతో పొత్తు కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని చాలాకాలంగా ఆరోపణలొస్తున్నాయి. జగన్ కేసులను అడ్డం పెట్టుకుని బీజేపీ ఎదగాలని ప్రయత్నం చేస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ADVERTISEMENT

గతవారం మోదీని కలిసేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి యత్నించారు. పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయానికి విజయసాయిరెడ్డి వెళ్లారు. ప్రధాని ఆఫీస్ దగ్గర ఉన్న విలేకరులను చూసి ఆయన బయటకు వెళ్లిపోయారు. దీనితో ఈ విమర్శలు మరింత పెరిగాయి దీనిపై విజయసాయిరెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

తాను ఎవరినైనా కలవాలంటే సీఎం చంద్రబాబు అనుమతి అవసరంలేదని ఆయన అన్నారు. ఎవరిని కలిసినా ప్రజా సమస్యలు చర్చించడానికే ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రధాని మోదీని మూడుసార్లు కలిసి ప్రజా సమస్యలపై చర్చించానని, అవిశ్వాసం చర్చకు రావాలని చిత్తశుద్ధితో కోరుకుంటున్నామని ఆయన చెప్పారు.

ADVERTISEMENT
Latest Stories