
సినీ సెలబ్రెటీ అయినా రాజకీయంగా ఎదగాలంటే రిజర్వేషన్ కార్డు, మహిళా కార్డు వాడాల్సిందేనా అన్నట్టుగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ, సీనియర్ పొలిటిషన్, లేడీ అమితాబ్ విజయశాంతి సైతం తన రాజకీయ ఎదుగుదలకు రిజర్వేషన్ కార్డు ను బయటకు తీయడం సర్వత్రా చర్చకు దారి తీసింది.
తల్లి తెలంగాణ అంటూ పార్టీ స్థాపించిన విజయశాంతి, ఆ తరువాత తన పార్టీని తెరాస లో విలీనం చేసి తెలంగాణలో ఉన్న దాదాపు అన్ని రాజకీయ పార్టీల జెండాలను మోశారు, కండువాలను మార్చారు.
Also Read – ఆడ..ఈడ: పుష్ప “రప్పా రప్పా” రచ్చ.!
దీనితో ఆమె రాజకీయ విలువలు, సిద్ధాంతాల మీద అన్ని పార్టీలలోను చిన్న చూపే. అంతేకాదు రాజకీయాలలో రాములమ్మ ఎదుగుదలకు ఆమె తీసుకునే చంచలమైన నిర్ణయాలే ఆమెకు పెద్ద అడ్డుగోడగా మారుతున్నాయి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
గత ఎన్నికల ముందు బీజేపీ నుండి కాంగ్రెస్ లో చేరిన ఈ సీనియర్ సినీ సెలబ్రెటీ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో కూడా క్షేత్ర స్థాయిలో పనిచేయలేకపోయింది. అలాగే పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచే వరకు రాములమ్మ తెలంగాణ రాజకీయాలలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఎక్కడ కానరాలేదు.
Also Read – వైసీపీ ‘రక్త దాహం’ తీరలేదా.?
అలాగే ఇటు రాష్ట్ర స్థాయి పార్టీ నాయకత్వం కూడా విజయశాంతి రాజకీయ పయనం పై ఎటువంటి చర్చకు తావివ్వలేదు. రాములమ్మ ఎమ్మెల్సీ అవకాశాల అభ్యర్ధనలు కానీ, ఆమె వినతులు కానీ రేవంత్ సర్కార్ పరిగణలోకి తీసుకోలేదు అనే ప్రచారం జరిగింది.
దీనితో ఢిల్లీ పెద్దలతో రాయబారాలు నడిపిన శాంతి చివరికి వారి ఆశీస్సులతో ఎమ్మెల్సీ పదవిని అందుకోగలిగారు. ఇటు సినిమాలలో కూడా ఇప్పుడిప్పుడే కాస్త యాక్టీవ్ అవుతున్న విజయశాంతి, తన తాజా చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రానికి గాను మూడు కోట్ల మేర రెమ్యునిరేషన్ అందుకున్నట్టు సమాచారం.
Also Read – యుద్ధాలు చేయకుండా అమెరికా ఉండలేదేమో
అయితే ఆర్థికంగా బలపడి, పార్టీ కోసం బలహీనంగా కష్టపడిన విజయశాంతి వంటి సినీ సెలబ్రెటీ సైతం బీసీ కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కాంగ్రెస్ పెద్దలతో చర్చోపచర్చలు సాగిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం.
రిజర్వేషన్ కోట అంటే ఆర్థికంగా వెనుకబడిన రాజకీయ నాయకులకు అవకాశం అందించడం. కానీ ఆ ఉద్దేశాన్ని తుంగలో తొక్కి ఇటువంటి సెలబ్రెటీ స్టేటస్ ఉన్న నేతలు సైతం రిజర్వేషన్ ద్వారా ఎదగాలని ఆశపడడం అంటే ఆర్థికంగా వెనుకబడిన నేతలను అణిచివేయడమే అవుతుంది.
అతి త్వరలో రేవంత్ సర్కార్ మంత్రి వర్గ విస్తరణ ఉండబోతున్న ఈ తరుణంలో అధిష్టానం వద్ద ఎవరి విన్నపాలు వారు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ మంత్రి వర్గంలో 12 మంది మంత్రులు ఉన్నారు. మరో ఆరుగురికి మంత్రి వర్గంలోకి అడుగుపెట్టే అవకాశం ఉండడంతో ఆ ఆరు స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీలో 60 మంది పోటీపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే శాంతి కూడా తనవంతుగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తో సమావేశమయ్యి 15 నిముషాల పాటు తన వాదన వినిపించారు. రేవంత్ సర్కార్ క్యాబినెట్ లో తనకు బీసీ కోటాలో అవకాశం కల్పించాలంటూ రాములమ్మ హస్తిన కేంద్రంగా రాయబారాలు చేస్తున్నారు.
అయితే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, పదేళ్లు ప్రతిపక్షంలో ఉంటూ అధికార బిఆర్ఎస్ పై పోరాటాలు చేసిన నాయకులకు ఇటువంటి మంత్రి పదవులు దక్కాలనేది కాంగ్రెస్ క్యాడర్ అభిప్రాయం. ఐదేళ్లకొకసారి పార్టీ మారుతూ, ప్రజా క్షేత్రానికి దూరంగా ఉంటూ పదవులు కోసం అధిష్టానంతో సమావేశాలు నడిపే నేతలు ఎప్పటికి పార్టీ బలోపేతానికి కారకులు కారు కాలేరు.
ఈ విషయంలో అద్దంకి దయాకర్ విజయశాంతి కంటే బెటర్ అభ్యర్థి ఎంపిక అవుతారు. ఈయన తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు, అలాగే పదేళ్లుగా అధికార బిఆర్ఎస్ పార్టీతో పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇలా పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న వారిని అధిష్టానం గుర్తిస్తుందా.? లేక హై కమాండ్ ఢిల్లీలో చేసే లాబీయింగ్లకు ప్రాధాన్యం ఇస్తుందో చూడాలి.