మంత్రి రోజాకు విజయసాయి రెడ్డి షాక్

Roja_YSRCP_Ministerఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్‌కె. రోజాకు విజయసాయి రెడ్డి చిన్న షాక్ ఇచ్చారు. ఆమెను వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలి పదవి నుంచి తొలగించి ఆమె స్థానంలో ఎమ్మెల్సీ పోతుల సునీతను నియమించారు. విజయసాయి రెడ్డి వైసీపీ అనుబంద సంఘాల ఇన్‌ ఛార్జ్ కనుక మంత్రిగా ఉన్న రోజాను ఆ పదవి నుంచి తప్పించి పోతుల సునీతకు ఆ బాధ్యతలు అప్పగించారు. మరి ఈ విషయం ఆయన ఆర్‌కె. రోజాకు ముందుగానే చెప్పారో లేదో తెలీదు కానీ ఆమెకు ఇది పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. మంత్రి పదవి దక్కినందుకు ఆమె సంతోషించేలోగా కీలకమైన మహిళా అధ్యక్ష పదవిని తొలగించడంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంటుంది కనుక ప్రక్షాళన పేరుతో ఆమెకు వేరే పదవి కట్టబెట్టవచ్చని తెలుస్తోంది. వచ్చే నెల 8, 9 తేదీలలో గుంటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. కనుక అంతకు ముందే ఆర్‌కె. రోజాకు మరో పదవి కట్టబెట్టవచ్చని సమాచారం.

ADVERTISEMENT
Latest Stories