యాక్షన్ చిత్రాల దర్శకుడిగా మంచి పేరున్న వినాయక్ తాజాగా ‘అఖిల్’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. అక్కినేని ప్రిన్స్ అఖిల్‌ను ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌కు వినాయక్ పరిచయం చేశాడు. అఖిల్ ఎంట్రీ భారీగా, రిచ్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో దాదాపు 50 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను వినాయక్ తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. తీరా చూస్తే ‘అఖిల్’ ఫలితం అట్టర్ ఫ్లాప్. నిర్మాతతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీగా నష్టపోయారు. ‘అఖిల్’ విడుదల తర్వాత నిర్మాత నుండి రావాల్సిన తన పారితోషికాన్ని వినాయక్ వద్దనుకున్నాడట. అలాగే డిస్ట్రిబ్యూటర్లకు సైతం కొంత మేరకు నష్ట పరిహారం ఇవ్వాలని వినాయక్ భావిస్తున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
సినిమా ఫ్లాప్‌కు దర్శకుడు పరిహారం ఇవ్వడం ఏంటని ఇతర దర్శకులు అంటున్నారు. వినాయక్ అలా చేస్తాడని తాము భావించడం లేదని, పారితోషికం వద్దనుకోవడం వరకు అయితే ఓకే కాని, డిస్ట్రిబ్యూటర్లకు పరిహారం కట్టించడం అనేది వినాయక్ చేయబోడు అని కొందరు ఆయన సన్నిహితులు అంటున్నారు. వినాయక్ మంచి మనస్సుతో డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోబోతున్నాడు అంటూ ఫిల్మ్ సర్కిల్స్‌లో ఒక వర్గం ప్రచారంను ఉదరగొడుతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది వినాయక్ నోరు విప్పితే కాని తేలదు.



