ఐపీఎల్ 2025 ప్రారంభానికి సన్నాహాలు సిద్ధం కానున్నాయి. రేపు సాయంత్రం 5 గంటలకు అన్ని జట్లు, వారు రీటైన్ చేసుకున్న ఆటగాళ్ల పేర్లను అధికారంగా విడుదల చేయబోతున్నారు. అయితే, ఇప్పటికే ఈ రిటెన్షన్ విషయమై ఎన్నో పుకార్లు సోషల్ మీడియాలో సందడి చేసినప్పటికీ, ఫాన్స్ కు అసలైన కిక్ ఇచ్చే వార్త ‘కింగ్ ఈజ్ బ్యాక్’ నిన్న రాత్రి నుండి నెట్టింట చక్కర్లు కొడుతుంది.
Also Read – ఎక్కడ తగ్గాలో కూటమిలో అందరూ నేర్చుకున్నట్లేనా?
ఐపీఎల్ 2021 ముగిసిన తరువాత ఆర్సీబీ కెప్టెన్సీ కు గుడ్ బాయ్ చెప్పేసిన విరాట్ కోహ్లీ,మళ్ళీ తిరిగి కెప్టెన్సీ పగ్గాలను స్వీకరించలేదు. ఐపీఎల్ 2023 లో తాత్కాలికంగా రెండు మ్యాచ్లకు కెప్టెన్ గా ఉన్నప్పటికీ, ఫుల్ టైం కెప్టెన్ గా చూడాలనే అభిమానుల ఆశ, ఆశ గానే ఉండిపోయింది. అయితే సరిగ్గా మెగా ఆక్షన్ ముందు,విరాట్ తిరిగి కెప్టెన్సీ పగ్గాలను అందుకోనున్నారు అనే వార్త వైరల్ అవుతోంది.
ఈ విషయమై, ఆర్.సి.బీ జట్టు సోషల్ మీడియాలో ఏ అధికార ప్రకటనా చేయనప్పటికీ, ‘ఈ.ఎస్.పీ.ఎన్’ వంటి దిగ్గజ సంస్థ పేర్కొన్న వార్త కావడంతో, అది నిజమే అని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.అయితే, ఈ వార్త వెనుక నిజానిజాలు ఇంకా జట్టు యాజమాన్యం నుండి రాకపోవటంతో, అభిమానులు కాస్త సంకోచ స్థితి లో ఉన్నారు.
Also Read – సెలబ్రేటీలు పిలిచినా రారు!… అవును ఎందుకు రావాలి?
అయితే, ఈ వార్త వెనుక అసలు నిజం ఏంటంటే, వచ్చే మెగా ఆక్షన్ కు ఆర్.సీ.బీ తమ సారధి ‘డు ప్లెసిస్’ ను విడుదల చేసే ఉద్దేశం లో ఉండగా, జట్టుకు కొత్త కెప్టెన్ అవసరం పడింది. పంత్, రాహుల్ వంటి ఆటగాళ్లను కొనడం లో జట్టు విఫలమయితే, విరాట్ కెప్టెన్ గా ఉండేందుకు అంగీకరించారని సమాచారం. అది కూడా కేవలం ఐపీఎల్ 2025 వరకే!
మరి, ఆర్.సీ.బీ జట్టు కు పంత్,రాహుల్ వంటి సారధి అవసరం ఎంతుందో, అభిమానులకు మరల విరాట్ కెప్టెన్సీ ను చూడాలనే కుతూహలం మరింత ఎక్కువగా ఉంది. ఇదిలా ఉండగా, ఈ వార్త రావడం ఆలస్యం, నెట్టింట ‘అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే’ అనే డైలాగ్ ను విరాట్ అభిమానులు గట్టిగా ట్రెండ్ చేస్తున్నారు. చూడాలి మరి అభిమానులకు మరొకసారి విరాట్ ను కెప్టెన్ గా చూసే అవకాశం దక్కుతుందో లేదో అని..!
Also Read – విజయసాయి సూచన: వాళ్ళకి సోషల్ మీడియాని బ్యాన్ చేయాలట!