Virat Kohli’s Dream Run Ends with IPL Glory

ఎప్పుడెప్పుడా అని ఎన్నో ఏళ్ళ తరబడి ఎదురుచూసిన క్షణాలు రానే వచ్చాయి. కెరీర్ లో అన్నీ అందుకున్న ఆ ఆటగాడు ఈ ఒక్కటీ ఇక అందుకోలేడు, అందుకుంటాడనే ఆశ సన్నగిల్లుతున్న వేళ, పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఐపీఎల్ 18 వ సీజన్ ఫైనల్ లో నెగ్గి, ఆర్సీబీ 18 ఏళ్ళ నిరీక్షణకు తెర దించాడు.

ఐపీఎల్ లో తన మొదటి కప్ ను ముద్దాడి, క్రికెట్ లో ఎవ్వరికి సాధ్యం కానీ విధంగా,కెరీర్ లో ఆడిన ప్రతీ ట్రోఫీ ను అందుకున్న ఏకైక ప్లేయర్ ‘విరాట్ కోహ్లీ’ చరిత్ర సృష్టించాడు. ఈ సాల కప్ నందే.? ఈ సాల నందే.? అన్న ప్రశ్నలకు నిన్నటికి ‘ఈ సాల కప్ నందు’ అంటూ బదులు చెప్పాడు కింగ్ కోహ్లీ.

Also Read – ఫోన్ ట్యాపింగ్: ఒక్క ట్విస్టుతో కధ క్లైమాక్స్‌కి.. భలే ఉందే!

కెరీర్ ఆరంభంలోనే అండర్-19 ఇండియా జట్టు కు సారధిగా ఎంపికయ్యి, సౌత్ ఆఫ్రికా తో జరిగిన ఫైనల్ లో భారత్ ను విజేతలుగా నిలిపి, కెప్టెన్ గా తన మొదటి ట్రోఫీ ను అందుకున్నాడు కోహ్లీ. ఇక, అక్కడినుండి భారత జట్టులో చోటు సంపాధించి అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు కోహ్లీ.

తాను ప్లేయర్ గా ఆడిన మొదటి వరల్డ్ కప్ టోర్నీ లోనే భారత జట్టు విజేతగా నిలిచింది. ఆ పై 2013 లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ లో సైతం కోహ్లీ చాల ముఖ్యమైన పాత్ర పోషించి, భారత్ ను విజేతగా నిలిపారు. 2015 లో రెడ్ బాల్ కెప్టెన్ గా నియమితుడై, ఎక్కడో 7 వ స్థానంలో ఉన్న భారత్ ను మొదటి స్థానానికి పట్టుకెళ్లటమే కాక, వరుసగా 3 టెస్ట్ మేస్ లను అందించాడు కోహ్లీ.

Also Read – కమ్మవారి ఊసు జగన్‌ కేల?

ఇలా, తన కెరీర్ లో అన్నీ చూసేసాడనుకున్న విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్ కప్ కోసం చాలా ఏళ్ళు నిరీక్షించాడు. అతి ముఖ్యంగా ఐపీఎల్ లో ప్రతీ సీజన్ నిలకడగా రాణించిన కోహ్లీ, తన జట్టును ఒక్కసారి కూడా విజేతలుగా నిలపలేకపోయాడు. ఇక పొట్టి ఫార్మాట్ లో కప్పు కష్టమే అనుకున్న వేళ, 12 నెలల గ్యాప్ లో అటు టి-20 వరల్డ్ కప్, ఇటు ఐపీఎల్ కప్.. రెండిటిని ఒడిసిపట్టుకున్నాడు ఈ రన్ మిషన్.

ఈ రెండు ట్రోఫీలు గెలిచిన క్షణాన కోహ్లీ చూపించిన ఆనందం, భావోద్వేగం అతని ఫాన్స్ నే కాక క్రికెట్ అభిమానులందరికి ఆనంద భాష్పాల విలువను రుచి చూపించాయి. ఇటీవలే ఐపీఎల్ ట్రోఫీ ను గెలుచుకున్న క్షణంలో కోహ్లీ ఎంతగానో భావోద్వేగానికి గురయ్యాడు.

Also Read – జగన్ రెచ్చిపోతున్నారు..పవన్ పత్తాలేరు.?


చంటి పిల్లాడిలా గ్రౌండ్ లో నే కన్నీరు పెట్టుకుని, ఫాన్స్ అందరిని ఎమోషనల్ అయ్యేలా చేసాడు. మళ్ళీ నిన్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగిన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం లో కూడా అవే భావోద్వేగ క్షణాలను రీక్రియాట్ చేసారు కింగ్ కోహ్లీ. ఏదేమైనా గాని, జూన్ నెల కోహ్లీ కు బాగా కలిసొచ్చింది అంటున్నారు క్రికెట్ అభిమానులు.