Yoga Day Visakhapatnam 2025, CM Chandrababu Yoga Event, Modi Yoga Beach Walk, International Yoga Day RK Beach

విశాఖ రాజధాని చేస్తానన్న జగన్‌ తన 5 ఏళ్ళ పాలనలో నగరంలో ఒక్క గొప్ప కార్యక్రమం నిర్వహించలేకపోయారు. కానీ సిఎం చంద్రబాబు నాయుడు జగన్‌లాగగా కబుర్లతో కాలక్షేపం చేయకుండా విశాఖలో చకచకా అభివృద్ధి పనులు చేస్తున్నారు.

శుక్రవారం అంతర్జాతీయ యోగ దినోత్సవం పురస్కరించుకొని ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులను విశాఖకి రప్పించి నగరంలో ఆర్‌కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు 26 కిమీ మేర 5 లక్షల మందితో యోగాసనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Also Read – భువి నుంచి దివికి ఒక తార.. దీవి నుంచి భువికి మరో తార!

దీని కోసం బీచ్ రోడ్డులో 26 కిమీల పొడవునా రహదారిపై యోగాసనాలు చేసేవారి కోసం మ్యాట్‌లు వేశారు. ఆర్‌కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు రోడ్లపై రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఎక్కడికక్కడ భారీ ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. రేపు జరుగబోయే ఈ కార్యక్రమంలో సుమారు 5 లక్షల మంది పాల్గొంటారని అధికారులు అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.

ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, గవర్నర్, సిఎం, డెప్యూటీ సిఎం, రాష్ట్ర మంత్రులు వస్తునందున విశాఖ నగరంలో భారీగా పోలీసులను మోహరించి భద్రత ఏర్పాట్లు చేశారు. విశాఖ సముద్ర తీరంలో ఈ కార్యక్రమం జరుగబోతున్నందున సముద్రంలో కూడా నావికాదళానికి చెందిన పలు యుద్ధ నౌకలు మోహరించింది. నావికా దళానికి చెందిన హెలికాఫ్టర్లు, యుద్ధ విమానాలతో విశాఖ నగరంపై పహరా కాస్తాయి.

Also Read – నిర్మాణం ఎలాగూ చాతకాదు కనీసం..

ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడు నిన్న మీడియాతో మాట్లాడుతూ, “చాలామంది సంపాదనపై ఆసక్తి చూపుతారు కానీ ఆరోగ్యంపై శ్రద్ద చూపరు. వారు అనారోగ్యం పాలైనప్పుడు కష్టపడి సంపాదించిన సొమ్మంతా ఆ వైద్యానికే ఖర్చు చేస్తుంటారు.

కానీ ప్రతీరోజూ కాసేపు యోగా చేస్తే ఎంత ఆరోగ్యంగా ఉండవచ్చో తెలుసుకోవాలంటే అందుకు నేను, ప్రధాని మోడీయే ప్రత్యక్ష నిదర్శనంగా ఉన్నాము కదా?కనుక ప్రజలందరూ కూడా ప్రతీరోజు కొంత సేపు యోగాభ్యాసం చేయాలి,” అని అన్నారు.

Also Read – మంగళగిరి మొనగాడెవరు.?

ప్రధాని మోడీ వయసు 74 కాగా, సిఎం చంద్రబాబు నాయుడు వయసు 75. ఈ వయసులో కూడా వారు ఇంత ఆరోగ్యంగా, ఇంత చురుకుగా ఉన్నారంటే ప్రతీరోజు యోగ చేస్తుండటమే కారణం.

కనుక సిఎం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.17 కోట్ల మంది ఈ కార్యక్రమంలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే యోగాసనాల కార్యక్రమాలు జరుగుతున్నాయి కూడా. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 326 యోగా జోన్లలో వీరందరూ యోగాభ్యాసం చేస్తారు.

రేపు విశాఖలో జరుగబోయే కార్యక్రమంలో పాల్గొనేందుకు నిన్ననే తరలి వచ్చిన పలువురు మంత్రులు, ప్రముఖులు, ఉన్నతాధికారులు బీచ్ రోడ్డులో వాక్‌ధాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో పాటు వేలాదిమంది ప్రజలు కూడా ఉత్సాహంగా వాక్‌ధాన్‌లో పాల్గొన్నారు. గవర్నర్‌ అబ్దుల్ నజీర్ కూడా గురువారం రాత్రి విశాఖ చేరుకున్నారు.