
శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డులో జరుగబోయే యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులు, త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు వస్తున్నారు.
Also Read – భారత్‌కు శాపంగా మారిన అమెరికా, చైనా?
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, పలువురు రాష్ట్ర మంత్రులు, డిజిపి, వివిద శాఖలకు చెందిన ఉన్నతాధికారులు విశాఖ నగరానికి వస్తున్నారు.
విశాఖ బీచ్ రోడ్డులో ప్రధాని మోడీతో సహా వారందరూ యోగాభ్యాసాలు చేయబోతుండటంతో యావత్ దేశ ప్రజల దృష్టి విశాఖ నగరంపైనే ఉంది.
Also Read – జగన్ దండయాత్రలే వైసీపీకి శాపంగా మరబోతున్నాయా?
ఒక్క విశాఖ నగరంలోనే రేపు ఆర్‌కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు 26 కిమీ మేర 5 లక్షల మందితో యోగాసనాలు చేసి సరికొత్త రికార్డ్ సృష్టించబోతున్నారు.
శుక్రవారం సాయంత్రమే గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో సహా పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు విశాఖ చేరుకున్నారు.
Also Read – జగన్‌వి శవరాజకీయాలట .. ఎంత మాటనేశారు నారాయణా?
సిఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు విశాఖ చేరుకుంటారు. ఆ తర్వాత ప్రధాని మోడీ సాయంత్రం 6.45 గంటలకు విశాఖ చేరుకుంటారు. ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు డిజిపి, ఉన్నతాధికారులు స్వాగతం చెపుతారు.
ప్రధాని మోడీ రాత్రి ఐఎన్ఎస్ కళింగ (తూర్పు నౌకాదళం) అతిధి గృహంలో బస చేస్తారు. శనివారం ఉదయం 6.30 గంటలకు ప్రధాని మోడీతో సహా అందరూ వైజాగ్ బీచ్ రోడ్డులో యోగాసనాలు జరిగే చోటికి చేరుకుంటారు.
ముందుగా ప్రధాని మోడీ, సిఎం చంద్రబాబు నాయుడు తదితరులు ప్రసంగించిన తర్వాత ఉదయం 7 నుంచి 7.45 గంటల వరకు అందరూ యోగాసనాలు వేస్తారు.
అనంతరం మద్యాహ్నం 11.50 గంటలకు ఐఎన్‌ఎస్ డేగా (తూర్పు నౌకాదళం) చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.
ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత సిఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి ఆదివారం ఉదయం ఉండవల్లికి తిరిగివస్తారు.
డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఇద్దరూ కూడా యోగాలో పాల్గొన్న తర్వాత శనివారం మద్యాహ్నం విజయవాడ తిరుగు ప్రయాణం అవుతారు.
image.png