గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నోరెత్తినా, ఆ పార్టీ నేతలు మీడియాలో కనిపించిన ముఖ్యంగా ప్రతిపక్ష నేతగా బాబు వైసీపీ ని ప్రశ్నించినా, లోకేష్ జగన్ పై ఆరోపణలు చేసినా ఆ మరు క్షణంలోనే మీడియాలో ప్రత్యక్షమయ్యి నారా వారి కుటుంబం పై బూతులతో రెచ్చిపోయేవారు మాజీ మంత్రి కొడాలి నాని.
అటువంటి బూతుల మంత్రి, జగన్ భక్తుడు ఇప్పుడు వైసీపీ తిరుమల లడ్డు వివాదంలో ఇరుకున్నా, అంబటి రాంబాబు వ్యవహారంతో రచ్చ చేస్తున్నా నాకు వినిపించలేదు, కనిపించలేదు అన్నట్టుగా మూగవాడిగా, గుడ్డివాడిగా, చెవిటివాడిగా అజ్ఞాతంలోనే జీవిస్తున్నారు వై.?
ఇక టీడీపీ నుంచి వైసీపీ తీర్ధం పుచ్చుకుని వైసీపీ డీఎన్ఏ లో భాగంగా మారిపోయి, కేవలం అధినేత సంతోష కోసం రాజకీయాలలో ఉండే సభ్యత – సంస్కారాన్ని పక్కన పెట్టి రాజకీయాలకు సంబంధం లేని మహిళలను చట్టసభలలో అవమానించిన వల్లభనేని వంశీ నేడు పార్టీని ఇన్ని వివాదాలు చుట్టుముట్టినా, పార్టీ ఇంతలా రోడ్ ఎక్కి హంగామా చేస్తున్నా కనీసం మీడియాలో కూడా కనిపించడం లేదు వై.?
అలాగే నాడు కాకినాడ నా అడ్డా, ఎవరొస్తారో చెప్పు బిడ్డా, అంటూ వైసీపీ జెండాలతో టీడీపీ, జనసేన నేతల పై వీరంగం చేసిన ద్వారం పూడి ఇప్పుడు పార్టీ వివాదాలలో ఉన్నా, నేతల అరెస్టులతో రచ్చ జరుగుతున్నా పార్టీ కోసం నేను సైతం అంటూ ఆయన ఇంటి ద్వారాలు తెరవలేకపోతున్నారు వై.?
భీమవరంలో పవన్ ను ఓడించా, వైసీపీ పార్టీ పరువు నిలబెట్టా, నా ముందు పవన్ ఎంతా.? నా పార్టీ బలం ముందు టీడీపీ బలమెంతా అంటూ నాడు గెలిచిన అహంతో రెచ్చిపోయిన గ్రంథి శ్రీనివాస్ నేడు పార్టీ కోసం, పార్టీ చేస్తున్న కుల రాజకీయం కోసం ముందుకు రాలేకపోతున్నారు వై.?
ఇక జగన్ కోటరీలో అత్యతం శక్తి వంతుడిగా పేరుపొందిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సైతం అటు తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదంలో కానీ ఇటు అంబటి అరెస్టు నేపథ్యంలో కానీ, జోగి రచ్చలో కానీ పార్టీ తరుపున బయటకొచ్చి బలమైన గళం వినిపించలేదు వై.?
ఇలా నాడు వైసీపీ కి ప్రతిరూపంగా మారిన ఈ సోకాల్డ్ నాయకులు ఇప్పుడు వైసీపీ ప్రతి చర్యలలో ఎందుకు కనిపించడం లేదు.? పేర్ని నాని, గుడివాడ అమర్నాధ్, భూమన మాదిరి కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు.?
నాడు టీడీపీ మీద రెచ్చిపోయిన నోర్లు, బాబు లోకేష్ పై విరుచుకుపడిపోయిన స్వరాలూ, తమ చేష్టలతో, చర్యలతో పవన్ ను కించపరుస్తూ జనసేనను రెచ్చకొట్టిన నేతలు ఇప్పుడు కలుగులో దాక్కున్న ఎలకల మాదిరి దాక్కుంటున్నారు వై.?
కొందరు జైలుకెళ్లోచ్చిన అనుభవాన్ని తలచుకుంటూ పార్టీ తరుపున నిలబడలేకపోతున్నారా.? మరికొందరు అరెస్టు భయంతో పార్టీ కోసం రాష్ట్ర సరిహద్దులలోకి అడుగుపెట్టలేకపోతున్నారా.? నాడు చేసిన పాపాలు, అక్రమాలు, అరాచకాలను తమ మౌనంతో ముసుగు వేయాలనుకుంటున్నారా.?
అందులో భాగంగానే తాత్కాలికంగా పార్టీకి మా సేవలు రద్దు చేయబడ్డాయి అంటూ పక్కకు తప్పుకుంటున్నారా.? ఇలా అనేకమంది వైసీపీ నేతలు ప్రజలు తమకిచ్చిన తీర్పుతో తమ తమ రాజకీయ నెట్ వర్క్ కి దూరంగా ఉంటూ వైసీపీ కి అందుబాటులోకి రావడం లేదు.
కానీ ఇప్పటికి వైసీపీ లో కొందరు మాత్రం జగన్ మెప్పు కోసం ఏ స్థాయికైనా దిగజారగలము అని అంబటి మాదిరి నిరూపించుకుటూనే ఉన్నారు. కొడాలి కాకాపోతే అంబటి వంశీ కాకపోతే పేర్ని అన్నట్టుగా వైసీపీ ఇటువంటి రాజకీయ నాయకులకు కొదవే లేదని చెప్పాలి.






