పవన్ చెల్లెలు కవితకి ఒక మాట చెప్తారా?

Kalvakuntla Kavitha - Pawan Kalyanఏపీ స్పెషల్ స్టేటస్ పై తెరాస ఎంపీల మాటలకే ఉబ్బిపోయి ప్రశంసల వర్షం కురిపించేసిన పవన్ కళ్యాణ్ కేసీఆర్ కుమార్తె కవితను చెల్లెలు అని కూడా సంబోధించారు. అవిశ్వాసం పెడితే తెరాస తప్పకుండా సపోర్ట్ చేస్తుందని ప్రకటించేసారు కూడా. అయితే కావేరి అంశంపై అన్నాడీఏంకే, రిజర్వేషన్ల అంశంపై తెరాస సభ్యులు వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేపట్టడంతో ఆ వంకతో సభను వాయిదా వేస్తుంది ప్రభుత్వం.

తెదేపా, వైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలపై లోక్‌సభలో సోమవారం కూడా చర్చ సాగలేదు. వారి తీర్మానాలను లోక్‌సభ స్పీకర్‌ స్వీకరించినప్పటికీ సభా సజావుగా సాగకపోవడంతో చర్చ చేపట్టలేదు. ఒకరకంగా కేసీఆర్ పార్టీ మోడీ ప్రభుత్వానికి ఇండైరెక్ట్ గా సపోర్టు చేస్తుంది. తమ పార్టీ నిరసన అవిశ్వాస తీర్మానంపై చర్చకు అడ్డుకాదని.. 52 మంది ఎంపీల సంతాకాలు చేస్తే సరిపోతుందని తెరాస ఎంపీ వినోద్‌ అన్నారు

ADVERTISEMENT

నిరసనల మధ్యే స్పీకర్‌ మూడు చట్టాలు ఆమోదించినట్లు ఆయన గుర్తు చేశారు. నిజమే సభ సజావుగా సాగడం లేదని వంక పెట్టుకుని ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే నిరసనలు మాత్రం ఆపకపోవడం తెరాస రెండు నాలుకల ధోరణికి నిదర్శనం. మరి చెల్లెలు కవితకు ఒక మాట చెప్పరాదూ పవన్ కళ్యాణ్?

ADVERTISEMENT
Latest Stories