జగన్‌ ప్యాలస్‌ బయటకు రావాలంటే…

jagan-palace

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఏవిదంగా రాజకీయాలు చేసుకోవాలో చెప్పేవారు. పదవి, అధికారం కోల్పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏవిదంగా పనిచేయలో చెపుతున్నారు.

ADVERTISEMENT

కానీ తాను శాసనసభ సమావేశాలకు వెళ్ళరు. వెళ్ళకపోతే పాయే.. కనీసం ప్రజలు, పార్టీ కార్యకర్తల మద్యకైనా వెళ్ళాలి కదా?

కానీ తాడేపల్లి ప్యాలస్‌లో 12 నెలలుగా అజ్ఞాతవాసం చేసినా ఎందుకు బయటకు రావడం లేదు?

కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని, సంక్షేమ పధకాలు అందక ప్రజలు తనను గెలిపించుకొని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆరాటపడుతున్నారని జగన్‌ గొప్పలు చెప్పుకొంటున్నారు కదా? రాష్ట్రంలో 40 శాతం ప్రజలు మనవైపే ఉన్నారని చెప్పుకున్నారు కదా?

మరి ప్యాలస్‌ గడప దాటి బయటకు రావడానికి ఎందుకు భయపడుతున్నారు?ఒకవేళ ప్రాణభయం వల్లనే అయితే ఈవిదంగా ప్యాలస్‌లో కూర్చొని రాజకీయాలు చేస్తానంటే పార్టీ మిగులుతుందా?జగన్ చెప్పే కాకమ్మ కధలని ప్రజలు నమ్ముతారా?

నాడు ఓదార్పు యాత్రలు చేసి అందరినీ ఓదార్చినప్పుడు, కేసులలో చిక్కుకొని తల్లడిల్లుతున్న వైసీపీ నేతలను, కార్యకర్తలను ఎందుకు ఓదార్చడం లేదు?వారికి ఎవరు దిక్కు?

జగన్‌ ప్యాలస్‌ బయటకు వస్తే జైల్లో ఉన్న తన పార్టీ అందగాళ్ళని పరామర్శించడానికి లేదా రాష్ట్రంలో ఎవరైనా చనిపోతే వారి కుటుంబాలను పరామర్శించడానికి మాత్రమే అనే ఆనవాయితీగా మార్చుకున్నారు.

ఇప్పుడు దానికి సవరణలు చేసి దొంగతనాలు, హత్యలు, గూండాయిజం, గంజాయి విక్రయం వంటి నేరాలు చేసిన రౌడీ షీటర్ల కుటుంబాలను పరమర్శిస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అనుచరులైన చేబ్రోలు జాన్ విక్టర్, నవీన్ ఎలియాస్ కిల్లర్, దోమ రమేష్, సముద్రాల పవన్, సురేంద్రలపై గుంటూరు, తెనాలి, ఒంగోలు, టంగుటూరు పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్స్‌గా అనేక కేసులు నమోదు అయ్యున్నాయి.

వారిలో చేబ్రోలు జాన్ విక్టర్ పోలీసుల దాడిలో గాయపడ్డాడంటూ అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్‌ మంగళవారం తెనాలికి బయలుదేరుతున్నారు.

పార్టీ నేతలని, కార్యకర్తలని కలిసేందుకు రాని జగన్‌, పోలీస్ రికార్డులలో ‘రౌడీ షీటర్స్’గా నమోదైనవారిని పరామర్శించేందుకు బయలుదేరుతుండటం ద్వారా పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఎటువంటి సంకేతాలు పంపుతున్నారు?

పార్టీ కోసం కష్టపడే తమ కంటే రౌడీయిజం చేసేవారికే జగన్‌ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని కార్యకర్తలు అనుకోకుండా ఉంటారా?

ప్రజా సమస్యలు న్నాయని జగన్‌ చెపుతున్నప్పుడు వాటి గురించి ప్రభుత్వంతో పోరాడేందుకు రాకుండా రౌడీ షీటర్స్ కుటుంబాలను పరామర్శకు బయలుదేరాడాన్ని ప్రజలు ఏవిదంగా స్వీకరించాలి?

ADVERTISEMENT
Latest Stories