ఇంకా ఎంతకాలం అహంతో పార్టీలను దెబ్బ తీసుకుంటారో?

Why Jagan & KCR Reappear Only When Politics Turns Favorable

పదవీ అధికారం చేతిలో అధికారంలో ఉన్నప్పుడు నాయకులు శాసనసభలో, బయట బహిరంగ సభలలో చెలరేగిపోతుంటారు. రాజకీయాలలో ఇది చాలా సహజమే.

కానీ పదవీ అధికారం కోల్పోయినప్పుడు కూడా పార్టీ అధినేతలు అంతే నిబ్బరంగా ఉండాలని ప్రజలు కోరుకుంటారు. అలాంటి క్లిష్ట సమయంలో అధినేతలు తమకు అండగా నిలబడాలని పార్టీ శ్రేణులు కోరుకుంటాయి.

ADVERTISEMENT

చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌ వారి పార్టీ నేతలు అలాగే వ్యవహరించిన సంగతి ప్రజలందరికీ తెలుసు.

కానీ ఏపీలో జగన్‌, తెలంగాణలో కేసీఆర్‌ ఇద్దరూ పదవీ, అధికారం కోల్పోగానే ఒకరు తాడేపల్లి ప్యాలస్‌లో మరొకరు ఫామ్‌హౌసులో ఉండిపోయారు.

కానీ కేసీఆర్‌ హటాత్తుగా ఫామ్‌హౌసులో నుంచి బయటకు వచ్చి సింహంలా గర్జించారు. ఎందుకు?అని అనే ప్రశ్నకు కాంగ్రెస్‌, బీజేపి నేతలు తమ కోణంలో విశ్లేషించారు. కానీ అసలు కారణం ఇటీవల పంచాయితీ ఎన్నికలలో బీఆర్ఎస్‌ పార్టీ అంచనాలకు మించి సీట్లు గెలుకోవడమే అని చెప్పవచ్చు.

ఇక్కడ జగన్‌కి అలాంటి అవకాశం ఇంకా లభించలేదు. కానీ తమ కేసులలో కూటమి ప్రభుత్వం తమని ఏమీ చేయలేకపోతుండటం జగన్‌కి అలుసుగా కనిపించి ఉండవచ్చు. అలాగే మెడికల్ కాలేజీల పేరుతో వైసీపీ చేసిన హడావిడిపై బాగా చర్చ జరుగుతోంది. కనుక జగన్‌ కూడా ఇప్పుడు తరచూ బయటకు వస్తున్నారు.

అంటే పార్టీ ఓడిపోయినప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడరు కానీ పరిస్థితి సానుకూలంగా మారినప్పుడు వచ్చి ఆ క్రెడిట్ తీసుకుంటారన్న మాట!

అయితే అలా బయటకు వచ్చినప్పుడు కూడా ఇంతకాలం శాసనసభ సమావేశాలకు, ప్రజల మధ్యకు ఎందుకు రాలేదో ప్రజలకు వివరణ ఇచ్చుకోవాలనుకోరు. తాము బయటకు రావడమే చాలా గొప్ప విషయం… అదే ప్రజలకు తామిచ్చే గొప్ప వరమనట్లు మాట్లాడుతుంటారు.

పైగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్‌, జగన్‌ ఇద్దరూ కూడా తాము మాత్రమే గొప్పగా రాష్ట్రాలను పాలించగలమని, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరికీ చాతకాదని ఎద్దేవా చేస్తారు. తలకాయలు, తోలు తీస్తామని బెదిరిస్తున్నారు కూడా.

ఇటువంటి అహంకారం వల్లనే ఇద్దరూ పదవి అధికారం కోల్పోయారు. కానీ ఆ విషయం అంగీకరించడానికి కూడా వారికి అహం అడ్డొస్తోంది. ఆ అహంతోనే మళ్ళీ అహంకారంగా మాట్లాడుతున్నారు.

అంటే పార్టీలు మెల్లగా కోలుకుంటునప్పుడు, వారిరువురు ఆ క్రెడిట్ తీసుకునేందుకు బయటకు వచ్చి తమ పార్టీలను మళ్ళీ తామే దెబ్బ తీసుకుంటున్నారా? అనే సందేహం కలుగుతోంది.

ఒకవేళ వారి తీరు ఇలాగే కొనసాగితే చరిత్రని వారే పునరావృతం చేస్తారు. అదే జరిగితే వచ్చే ఎన్నికలలో వారు తమను వారు ఓడిస్తారని కాంగ్రెస్‌, కూటమి ప్రభుత్వం భయపడాల్సిన అవసరమే లేదు.

ADVERTISEMENT
Latest Stories