తాడేపల్లి ప్యాలస్ చుట్టూ రాజకీయం వై.?

Tadepalli Palace

వైసీపీ అధినేత వైస్ జగన్ మెహన్ రెడ్డి కి కూటమి ప్రభుత్వం అవసరమైన మేరకు భద్రత కలిపించడం లేదు, సిబ్బంది విషయంలో కోత విధిస్తుంది, జగన్ పర్యటనలో పోలీసుల బందోబస్తు సరిపోవడం లేదు,

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత తాడేపల్లి ప్యాలస్ ప్రమాదాల చుట్టూ ప్రయాణం చేస్తుంది….అంటూ గత కొద్దీ రోజుల నుంచి వైసీపీ అధినేత జగన్ నుంచి వైసీపీ నాయకులు వరకు జగన్ భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం పై చేస్తున్న విమర్శలు, రాజకీయ ఆరోపణలు ఈ విధంగా కొనసాగుతున్నాయి.

ADVERTISEMENT

అయితే వైసీపీ చేస్తున్న ఈ ఆరోపణలకు బలం చేకూరేలా జగన్ తాడేపల్లి ప్యాలస్ చుట్టూ రాజకీయం రాచుకుంటుంది. మొన్న జగన్ ఇంటి ముందు అగ్ని ప్రమాదం అంటూ వైసీపీ శ్రేణులు నానా హంగామా చేసారు.

జగన్ కు ప్రమాదం తలపెట్టడానికే ఆయన ప్యాలస్ ముందు మంటలు సృష్టించారు, దీని వెనుక పెద్ద కుట్ర దాగిఉంది, ప్రభుత్వం జగన్ భద్రత ను మరింత పటిష్టం చెయ్యాలి అంటూ కూటమి పై రెచ్చిపోయిన వైసీపీ తీరా అంశం విచారణకు వచ్చి ఆ నిందితులను కనిపెట్టడానికి తాడేపల్లి ప్యాలస్ వెలుపల సీసీ కెమెరా విజువల్స్ అడిగితే అందుకు నిరాకరించింది…వై.?

వైసీపీ కి కావాల్సింది కూటమి ప్రభుత్వం పై రాజకీయ విమర్శలు చేయడమా.? లేక జగన్ భద్రత పై ప్రజలలో సానుభూతి సృష్టించడమా.? ఇక నిన్న కారులో నుంచి ఒక వ్యక్తి జగన్ ప్యాలస్ గేట్ వైపుకి ఒక కొబ్బరి బొండం విసిరేశారు. అయితే ఈ ఘటనతో వైసీపీ మరోసారి జగన్ భద్రత అంశం పై ప్రభుత్వాన్ని నిలదీసింది.

అయితే ఇలా జగన్ తాడేపల్లి ప్యాలస్ చుట్టూ ఒకదాని తరువాత మరొకటి అనుకోని ఘటనలు జరుగుతుంటే కేవలం ప్రభుత్వాన్ని నిందించి, చేతులు దులుపుకుంటున్న వైసీపీ అసలు ఘటనకు కారకులెవ్వరు అన్న అంశం మీద ద్రుష్టి పెట్టడం లేదు, అందుకు అటు ప్రభుత్వానికి ఇటు అధికారులకు సహకరించడం లేదు…వై.?

ఇక ఇప్పుడు తాజాగా నంది వెలుగుకు చెందిన ఒక ఆటో డ్రైవర్ తోట గోపి అనే యువకుడు జగన్ ప్యాలస్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసారు. అయితే అక్కడ ఉన్న భద్రత సిబ్బంది అడ్డుకోవడంతో ఆ యువకుడు ఎటువంటి ప్రమాదం లేకుండా బయటపడ్డాడు.

కొందరు నాయకులు తన కుటుంబాన్ని వేధించడంతో మనస్తాపంతో జగన్ కలిసేందుకు వచ్చానంటూ చెప్పుకొచ్చాడు బాధితుడు. అయితే గతంలో వైసీపీ కి ఉన్న ట్రాక్ రికార్డు ఒక్కసారి పరిశీలిస్తే కోడికత్తి ఘటన మొదలు కుని, వివేకా గొడ్డలి పోటు, గులకరాయి దుర్ఘటన వరకు అన్ని అంశాలలో చివరికి వేళ్లన్ని వైసీపీ వైపే చూపించబడ్డాయి.

దీనితో వైసీపీ రాజకీయంలో ఏది వాస్తవమో ఏది కల్పితమో అర్ధం చేసుకోవడానికి నాలుగు దశబ్దాల రాజకీయ అనుభవం ఉన్న పార్టీలకే చాల సమయం పట్టింది. ఇక సామాన్యుడికి వైసీపీ జగన్నాటకాలు అంత ఈజీగా తెలిసిపోతాయి. అయితే అసలు జగన్ తాడేపల్లి ప్యాలస్ చుట్టే ఈ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి…వై.? అనే ప్రశ్నకు కూటమి నిగ్గుతేల్చాల్సి ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories