అవును రెండు తెలుగు రాష్ట్రాలలోను ఏ రాజకీయ పార్టీ కానీ ఏ పార్టీ నాయకులు కానీ కోర్టుల చుట్టూ ఈ విధంగా తిరగలేదు అని చెప్పడం లో ఎటువంటి అతి సయోక్తి లేదు. పార్టీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి మొదలుకుని పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి వరకు ప్రతి ఒక్కరు కోర్టుల చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటున్నారు.
అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే వైసీపీ అధికారంలో ఉన్నా లేకున్నా కూడా వైసీపీ ని కోర్టులు నీడలా వెంటాడుతూనే వస్తున్నాయి. నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా జగన్ తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వ పరంగా ముందుకెళ్లిన విధానాల పై కూడా న్యాయస్థానం తన గళం వినిపించింది.
వైసీపీ కి వ్యతిరేకంగా, జగన్ అండ్ కో కు కోర్టులు వందల సంఖ్యలో మొట్టికాయలు వేసిన ఘటనలు గత వైసీపీ హయాంలో కోకొల్లలు. ప్రభుత్వ కార్యాలయాల పై పార్టీ రంగుల నుంచి, రాజధాని మార్పు నిర్ణయం వరకు, అమరావతి రైతుల పోరాటాల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమాల వరకు న్యాయస్థానాలు వైసీపీ విధానాలను తప్పుబడుతూనే వస్తున్నాయి.
అలాగే నాటి రుషికొండ ప్యాలస్ నిర్మాణాల నుంచి నేటి లిక్కర్ మాఫియా కేసుల వరకు వైసీపీ నేతలు ఇటు ప్రజల ఛీత్కారాలతో పాటుగా అటు కోర్టుల చీవాట్లను ఎదుర్కుంటున్నారు. ఇక పార్టీ ముఖ్య నాయకులు సజ్జల రామకృష్ణ రెడ్డి, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి, వల్లభనేని వంశీ, నందిగామ సురేష్ మొదలుకుని
మాజీ మంత్రులు జోగి రమేష్, పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి, పేర్ని నాని, రోజా, కొడాలి నాని, సిదిరి అప్పలరాజు, విడుదల రజని వంటి వారందరు విచారణ కోసమో, ముందస్తు బైళ్ల కోసమో, బైళ్ల కోసమో ఇలా ఎదో ఒక కారణంతో కోర్టులను ఆశ్రయిస్తూనే ఉంటున్నారు.
ఇక పార్టీ అధినేతగా జగన్ మోహన్ రెడ్డి సైతం తన పాత కేసుల తాలూకా విచారణకై గత కొన్నేళ్లుగా కోర్ట్ కెల్లకుండా మేనేజ్ చేస్తూ వస్తున్నారు. కానీ ఇన్నాళ్ళుగా జగన్ కు దొరికిన వెసులుబాటు ఇక చెల్లదు అంటూ నాంపల్లి సిబిఐ కోర్ట్ జగన్ ను కేసుల విచారణ కై కోర్ట్ కు హాజరు కావాలంటూ ఆదేశించింది.
దీనితో ఇక సాకులు చెప్పేందుకు ఏమి లేక జగన్ ఎట్టకేలకు రేపు హైద్రాబాద్ లోని నాంపల్లి కోర్టుకి హాజరకున్నారు. చాల సంవత్సరాల తరువాత జగన్ నాంపల్లి కోర్టుకి హాజరు కావడంతో వైసీపీ నేతలకు ఈ కోర్ట్ భయం పట్టుకుంది. గతంలో మాదిరి ప్రతి శుక్రవారం జగన్ న్యాయస్థానం ముందు హాజరుకావాలంటూ సీబీఐ కోర్ట్ ఆదేశిస్తే మళ్ళీ జగన్ కు జైలు యాత్రలు మొదలయినట్టే అవుతుంది.




