Actress Aishwarya Rajesh

తెలుగు అమ్మాయికి తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు రావు, ఇవ్వరు అనేది ఎన్నాళ్ళనుంచో ఇండస్ట్రీలో పాతుకుపోయిన ఒక అభిప్రాయం. అయితే ఈ అభిప్రాయం కేవలం విమర్శుకులది మాత్రమేనా లేక వాస్తవ రూపంలో దీని ప్రభావం ఏ మేరకు పని చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం.

ఈ సంక్రాంతికి వచ్చిన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం మూడు సినిమాలలో అంచనాలకు మించి ప్రేక్షకుల మనసు దోచిన చిత్రం వెంకీ సంక్రాంతికి వస్తున్నాం. అయితే ఈ మూవీలో వెంకటేష్ భార్యగా నటించిన ఐశ్వర్య రాజేష్ కూడా మంచి గుర్తింపు వచ్చింది. దీనితో ఐశ్వర్య పుట్టుపూర్వత్రాల మీద సోషల్ మీడియాలో చర్చ మొదలయ్యింది.

Also Read – ఈ పైరసీల ఫాంటసీ ఏంటో..? దీనికి వాక్సిన్ లేదా.?

ఐశ్వర్య మన తెలుగమ్మాయి అంటూ కొందరు, ఐశ్వర్య మన తెలుగమ్మయా.? అంటూ మరికొందరు మరోసారి టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ ప్రస్తావన తీస్తున్నారు. కౌశల్య కృష్ణ మూర్తిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచమైన ఈ అమ్మడు నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ అవకాశాలను మాత్రం తెచ్చుకోలేకపోయిందనే చెప్పాలి. ఇక తమిళ ఇండస్ట్రీ మీద ఫోకస్ పెట్టిన ఐశ్వర్య అక్కడ చిన్న సినిమాల అవకాశాలతో కెరీర్ నెట్టుకొస్తున్నారు.

అయితే జర్నీ మూవీ తో తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకున్న మరో తెలుగు నటి అంజలి కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అంటూ మహేష్, వెంకటేష్ భారీ మల్టి స్టారర్ లో వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటించి మంచి పేరుతో పాటుగా నటిగా అవకాశాలను అందిపుచ్చుకున్నారు.

Also Read – వివేకా హత్యతో సంబందం లేకపోతే భయం దేనికి?

ఇపుడు ఐశ్వర్య కూడా ఇదే తరహాలో వెంకీ పక్కన నటించి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక అంజలి మాదిరే టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారా అంటూ సోషల్ మీడియాలో ఐశ్వర్య తెలుగు కెరీర్ మీద చర్చ జరుగుతుంది. అయితే అంజలి కూడా తనకు తెలుగులో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు హిట్ ను తన కెరీర్ బ్రేక్ మూవీ గా మలుచుకున్నప్పటికీ తరువాత ఆ స్థాయిలో విజావకాశాలను మాత్రం అందిపుచ్చుకోలేకపోయారు.




మరి ఐశ్వర్య కూడా అంజలి బాటలోనే పయనిస్తారా.? లేక ఆచితూచి అడుగులు వేసి సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ ను తన సినీ కెరీర్ కు ఒక నిచ్చెనలా మలచుకుంటారా.? లేక టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ సక్సెస్ అంత ఈజీ కాదు అనే నానుడికే తలవంచుతారా అనేది వేచి చూడాలి.

Also Read – బీజేపి విజయంలో చంద్రబాబు… కొందరికి ఎసిడిటీ తప్పదు!