
ఎన్నికలలో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలస్ నుంచి ఎప్పుడెప్పుడు బయటకు వస్తున్నారు?అంటే ఎవరైనా చనిపోతే వస్తారు లేదా వైసీపీ నేతలు ఎవరైనా జైల్లో ఉంటే పరామర్శించడానికి వస్తుంటారు. నేడు ఆ పని మీదే తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు వచ్చారు.
రాప్తాడులో పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య అనే వ్యక్తి హత్యకు గురవడంతో వచ్చి ఆ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. తర్వాత సిఎం చంద్రబాబు నాయుడు బాధ్యత చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, లింగమయ్య హత్యకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
Also Read – అందరి తాపత్రయం మైలేజ్ కోసమే?
ఆయన హయంలో టీడీపీ కార్యకర్తలు హత్య చేయబడితే టీడీపీ నేతలు ఇలాగే అన్నప్పుడు వెకిలినవ్వులు నవ్వేవారు. కానీ ఇప్పుడు తాను సూచించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని లేకుంటే తాను ముఖ్యమంత్రి కాగానే పోలీస్ అధికారులని గుడ్డలూడదీయిస్తానని జగన్ హెచ్చరించారు.
ఓ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ పోలీసుల గురించి ఇంత చులకనగా మాట్లాడటం సిగ్గుచేటు. అయినా తల్లిని, చెల్లిని, బాబాయ్, నమ్మిన బంటు విజయసాయి రెడ్డినే పట్టించుకోని జగన్, ముఖ్యమంత్రినే గౌరవించని జగన్, పోలీస్ అధికారులను గౌరవిస్తారనుకోవడం అత్యశే అవుతుంది.
Also Read – పిఠాపురం పంచాయితీ తీరినట్టేనా.?
ఇదివరకు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిత్యం ప్రజల మద్య ఉంటూ జగన్ ప్రభుత్వ వైఫ్యల్యాలు, అవినీతి, అక్రమాలపై పోరాడేవారు. కానీ జగన్ సంక్రాంతి తర్వాత ప్రజల మద్యకు వస్తానని చెప్పి ఉగాది తర్వాత కూడా రాలేదు. ఒకవేళ వస్తే ఇలా శవ రాజకీయాలతో కాలక్షేపం చేస్తూ సిఎం చంద్రబాబు నాయుడుని చాలా గట్టిగా ఎదుర్కొంటున్నానని ఆత్మవంచన చేసుకుంటారు. ఇలాంటి రాజకీయాలతో, ఇలాంటి వైఖరితో కాలక్షేపం చేస్తున్న జగన్‌ని నమ్ముకున్నవారందరి భవిష్యత్ ఎలా ఉంటుందో?