Ambati Rambabu

వైసీపీ నేతలు కేసుల భయంతో ఇంతకాలం కలుగుల్లో ఎలకల్లా దాగున్నారు. కానీ జగన్‌ ఏం చెప్పారో గానీ ఇప్పుడు ఒక్క పిలుపు ఈయగానే పోలోమని రోడ్లపైకి వచ్చేస్తున్నారు. ప్రెస్‌మీట్లు పెట్టి సిఎం చంద్రబాబు నాయుడుని, మంత్రి నారా లోకేష్‌ని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఈ నెల 4న వెన్నుపోటు దినం, తెనాలి, రెంటపాళ్ళ పర్యటనలు ఇందుకు తాజా నిదర్శనాలు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఇంత యాక్టివ్‌గా ఉండటం మంచిదే. చాలా అవసరం కూడా.

Also Read – జగన్ యాత్రలకు అర్దాలు వేరయా..!

కానీ తలకాయలు నరికేస్తాం.. అడ్డొస్తే తొక్కుకుపోతాం, కారు కింద పడితే పక్కకి ఈడ్చేస్తాం.. రప్పా రప్పా.. అంటేనే సమస్య మొదలవుతుంది.

ఈసారి సంక్రాంతికి సత్తెనపల్లిలో సంబరాల రాంబాబు రోడ్లపై రికార్డింగ్ డాన్స్ చేయలేకపోవడం అభిమానులకు చాలా బాధ కలిగించింది. కనుక జగన్‌ రెంటపాళ్ళ పర్యటన సందర్భంగా ఆయన పోలీసులపై చిందులు వేశారు. ఇంతకు ముందు వెన్నుపోటుకి వచ్చినప్పుడు ఓ సీఐపై అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Also Read – లోకేష్ -కేటీఆర్…రహస్య భేటీ.?

అందుకు ఆయనపై అప్పుడో కేసు, ఇప్పుడో కేసు నమోదు చేశారు. అయితే కేసులు నమోదు చేసి వాటిని అటక మీద భద్రపరుస్తుండటంతో అంబటి రాంబాబుకి కూడా కేసులంటే భయం పోయినట్లుంది. అందుకే సత్తెనపల్లిలో మరో కేసు పెట్టించుకున్నారు.

సైనికులకు, పోలీసులకు మెడల్స్ ఎలాంటివో వైసీపీ నేతలకు ఈ కేసులు కూడా అలాంటివే. ఎన్ని కేసులుంటే అన్ని మెడల్స్ లభించినట్లు.. జగన్‌కు అంత దగ్గరవ్యవచ్చునని అంబటి రాంబాబు కూడా గ్రహించారేమో?

Also Read – చంద్రబాబు నాయుడు మార్క్ చూపితే చాలు!


కనుక ఇకపై జగన్‌ పిలుపు ఇవ్వడమే ఆలస్యం.. అంబటి రాంబాబు రెడీ! కానీ రోజా, కొడాలి నాని, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్, సీడిరి అప్పల్రాజు వంటి హేమాహేమీలు ఈ కేసుల రేసులో వెనకపడిపోతున్నారు పాపం! ఇప్పటి నుంచే హడావుడి చేసి జైల్లో కూర్చోవడం దేనికి? ఎన్నికలకు ఏడాది ముందు హడావుడి చేస్తే చాలనుకుంటున్నారేమో?