
“జగన్ గుర్తు పెట్టుకో నిన్ను అదః పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు”, హలో ఏపీ బై బై వైసీపీ…అంటూ వైసీపీ కి చెప్పి మరి దెబ్బకొట్టిన రియల్ హీరోగా నాడు అందరి నోటా ప్రసంశలు దక్కించుకున్న పవన్ కళ్యాణ్ నేడు వైసీపీ దౌర్జన్య కాండ పై కనీసం గొంతెత్తలేక విమర్శలను ఎదుర్కుంటున్నారు.
పరామర్శల పేరుతో వైస్ జగన్ చేస్తున్న రాజకీయం ఏపీ భవిష్యత్ ను ప్రశ్నార్దకంలోకి నెడుతుంది. గంజాయి వినియోగదారులను వెనకేసుకొస్తూ ఒకసారి, బెట్టింగ్ జూదగాళ్ళకు విగ్రహ ఆవిష్కరణలు చేస్తూ మరొకసారి, తన పార్టీ నేతల అవినీతి, అక్రమాలను వెనకేసుకొస్తూ ఇంకోసారి…ఇలా జగన్ ఏదోఒక సాకుతో రోడ్ల మీదకు రావడం, అక్కడ వారి పార్టీ శ్రేణుల తో బలప్రదర్శన నిర్వహించడం పరిపాటిగా మారుతుంది.
Also Read – పాపం రాజాసింగ్.. రాజీనామాతో రాజకీయ అనాధగా మారారు!
అలాగే వైసీపీ క్యాడర్ కూడా తాము ప్రతిపక్షంలో ఉన్నాము అనే కనీస సృహ లేకుండా ప్రభుత్వం పై ప్రభుత్వ పెద్దల పై హద్దులు దాటి రెచ్చిపోతున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా పార్టీ అధినేత వైస్ జగన్ నుంచి పార్టీ సాధారణ కార్యకర్త వరకు అందరు కూడా హింసనే ప్రధాన ఆయుధంగా చేసుకుని ముందుకెళ్లడం ఏపీ భవిష్యత్ కు అత్యంత ప్రమాదకరంగా మారుతుంది.
ప్రభుత్వ అధికారులను బెదిరించడం దగ్గర నుంచి అధిక పార్టీల నాయకులను హెచ్చరించడం వరకు అందరిదీ ఒకటే తీరి. అయితే ఇందుకు జగన్ తాజా యాత్రలే నిదర్శనం. మొన్న పొదిలి ఘటన, నిన్న సత్తుపల్లి వివాదం ఇలా వైసీపీ చేస్తున్న హింసా రాజకీయాన్ని అటు పార్టీ పరంగా జనసేన కానీ, ఇటు ప్రభుత్వంలో ముఖ్య భాగమైన పవన్ కానీ ఖండించలేదు.
Also Read – సానుభూతి రాజకీయాలకు ప్రభుత్వాలు భయపడుతుంటే..
పొదిలి ఘటనలో వైసీపీ దారుణ కాండకు రక్తం చిందింది, ఇక సత్తునపల్లి లో భవిష్యత్ లో చిందబోయే రక్త ఆనవాళ్లు బయటపడ్డాయి. రాబోయే ఎన్నికలలో అధికారంలోకి వచ్చేది మేమే…అప్పుడు ఒక్కఒక్కడి ని రప్పా రప్పా నరుకుతాం నా…., అంటూ ఒకరు, అన్న వస్తాడు అంతు చూస్తాడు అంటు మరొకరు, ఏడూ సముద్రాలు దాటి వెళ్లినా వదిలి పెట్టేదేలేదు, పోలీస్ అధికారుల బట్టలూడదీస్తా అంటు జగన్ ఇలా నిత్యం రాష్ట్రంలో ఎదో ఒక రూపంలో వివాదం సృష్టించడం వైసీపీ అలవాటుగా మారిపోయింది.
అయితే వైసీపీ ఇంతలా రెచ్చిపోతున్నా రాష్ట్ర డిప్యూటీ సీఎం గా పవన్ మాత్రం తనకేమి పట్టనట్టుగా సినిమాల షూటింగ్ లలో బిజీగా ఉండడం పై విమర్శలు వినిపిస్తున్నాయి. అటు పార్టీ పరంగా కానీ ఇటు ప్రభుత్వ పరంగా కానీ పవన్ వైసీపీ దుస్సాహసాల పై మౌనంగా ఉండడం జనసేన అభిమానులను సైతం విస్మయానికి గురి చేస్తుంది.
Also Read – అభివృద్ధి అవసరమే.. కానీ డెడ్‌లైన్ 2029
పవన్ షూటింగ్ లో ఎక్కడ ఉన్నా కానీ వైసీపీ ఇటువంటి రెచ్చకొట్టే వ్యాఖ్యలతో తెగబడుతుంటే అటు పార్టీ శ్రేణులకు భరోసాగా, ఇటు సాధారణ ప్రజల పట్ల బాధ్యతగా పవన్ స్పందించి ఉంటే, వైసీపీ కి గట్టి కౌంటర్ ఇచ్చి ఉంటే బాగుండేది అనే వాదన సర్వత్రా వినిపిస్తుంది. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా ఉంటుందా.? లేక మెతక ప్రభుత్వంగా మారుతుందా.? అన్న అనుమానాలు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.
తన వృత్తి పరంగా పవన్ సినిమాలు చేయడాన్ని ఇక్కడ ఎవరు తప్పుబట్టడం లేదు, కానీ కేవలం 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ విధంగా రాష్ట్రాన్ని రావణ కాష్ఠంగా మార్చాలని భావిస్తుంటే వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత అటు సీఎం గా బాబు పై ఎంత ఉంటుందో ఇటు ఉప ముఖ్యమంత్రి గా పవన్ పై కూడా అంతే ఉంటుంది.
అటు సినిమాలు, ఇటు రాజకీయాలు రెండు సమానంగా బాలన్స్ చేయలేకపోతే పవన్ ఒకదానిని త్యదించక తప్పదు. లేకుంటే గత పదేళ్ల జనసేన అవమానాలకు, అవహేళనకు, పోరాటాలకు ఈనాటి విజయానికి, ఇప్పటి హోదాకు విలువ కోల్పోతారు.
నాడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పవన్ తన ఆవేశంతో వైసీపీ ని కట్టడి చేయగలిగారు. కానీ నేడు జనసేన అధికారంలో ఉంది, పవన్ చేతిలో పదవి అనే అస్త్రం ఉంది కానీ పవన్ కు ఇపుడు రాజకీయాలకు సమయం లేకపోవడం దురదృష్టకరం. ఏ లక్ష్యంతో అయితే వైసీపీ అంతం కోసం పోరాటం చేసారో, పొత్తులు పెట్టుకున్నారో చివరికి ఆ లక్ష్యాన్ని వైసీపీ విచ్ఛిన్నం చేయాలనీ భావిస్తుంది.
రాష్ట్రంలో అలజడి, అశాంతి సృష్టించి తద్వారా రాష్ట్రానికి వచ్చిన, రాబోతున్న పరిశ్రమలను, పెట్టుబడి దారులను భయాందోళనలకు గురి చేసి, వారిలో అభద్రతా భావాన్ని రేకిత్తించడమే వైసీపీ ముందున్న తక్షణ కర్తవ్యం. నిత్యం రాజధాని పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ భవిష్యత్ లో వైసీపీ అధికారంలోకి వస్తే.? అన్న ప్రశ్నను ఎల్లప్పుడూ చర్చలో ఉంచడమే జగన్ ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది.
ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరంగా, అరాచకానికి దగ్గరగా చేసే ప్రయత్నాలు. వీటిని కూటమి ప్రభుత్వ పెద్దలు ఆదిలోనే అరికట్టకపోతే 164 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ లు రాజకీయంగా ఫెయిల్ అయినట్టే భావించాలి. గెలుపుతోనే అంతిమ లక్ష్యం పూర్తి అయ్యింది అనేలా పవన్ ముందుకెళ్లడం జనసేనకే కాదు పవన్ రాజకీయ భవిష్యత్ కు పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది.
అమరావతి నిర్మణాల పూర్తి కోసమే కాదు వైసీపీ అరాచకాల నిర్ములనకు కూడా బాబు కు మద్దతుగా పవన్ చేతితో పాటు నోరు కలపాల్సి ఉంటుంది. నాడు బాబు రాజకీయంతో పాటు పవన్ చూపిన ఆవేశం వైసీపీ ని నిజంగానే పాతాళానికి తొక్కింది, కానీ నేడు కూటమి ప్రభుత్వ చూపుతున్న మంచితనానికి, పవన్ అనుసరిస్తున్న అలసత్వం అదే వైసీపీ కి తిరిగి జీవం పోస్తుంది అని గ్రహించాలి.