‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లి ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి మయం అయిపోయిందంటూ గగ్గోలు పెడుతూ వరుసగా కేంద్ర మంత్రులు, బిజెపి అధ్యక్షుల అప్పాయింట్మెంట్ లు కోరగా, బిజెపి అధ్యక్షుడితో సహా అందరూ జగన్ కు సమయాన్ని కేటాయించారు. అయితే చివరి నిముషంలో అమిత్ షా జగన్ కు ఇచ్చిన అప్పాయింట్మెంట్ ను రద్దు చేసారు.
ఉన్నట్లుంది అమిత్ షా ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం… టిడిపి వర్గాలు బిజెపిపై మండిపడడమేనని ఢిల్లీ వర్గాల మాట. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ కు కేంద్రమంత్రులు, బిజెపి అధ్యక్షుడు ఎ విధంగా అప్పాయింట్మెంట్ ఇస్తారని ఒత్తిడి తేవడంతో అమిత్ షా తన సమయాన్ని రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ బిజెపి నేతలు ఈ పరిణామాలను తిప్పికొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని, దీని ద్వా జగన్ దూకుడు కళ్ళెం వేయగలిగామని టిడిపి వర్గాలు చెప్తున్నాయి.



