రాజధాని నిర్మాణం అంటే ముందు చెయ్యాల్సిందేంటో జగన్ చెప్పారు !

YS jagan comments on Amaravati Constructionవైకాపా అధినేత జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం ఇడుపులపాయ చేరుకున్న జగన్‌ తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పించారు అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించిన జగన్‌ కొద్దిదూరంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు.

ADVERTISEMENT

ఈ సందర్భంగా జగన్ చంద్రబాబు నాయుడి రాజకీయ నిర్మాణ ప్లాన్ ని ఎద్దేవా చేసారు. రాజకీయ నిర్మాణం అంటే అన్నిటికంటే ముందు చెయ్యాల్సింది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, గవర్నమెంట్ ఉద్యోగులకు స్థలాలు, మరియు వారికి ఇంటి నిర్మాణం చెయ్యడం అంట. నేను గెలిస్తే చేయబోయేది అదే అని జగన్ అనౌన్స్ చేసారు.

అయితే జగన్ ప్రకటించిన తాయిలాన్ని ప్రజలు హర్షిస్తారా అనేది ఆయన, ఆయన పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. రాజధాని నిర్మాణం అంటే ముందు చెయ్యాల్సింది రాజకీయ నాయకులకు, గవర్నమెంట్ ఉద్యోగులకు స్థలాలు, ఇళ్ల నిర్మాణం చెయ్యడం అని జగన్ కు సలహా ఇచ్చిన వాళ్లకు నిజంగానే జోహార్లు చెప్పాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories