2019లో ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని కృతనిశ్చయితంగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చివరిగా పాదయాత్ర మొదలుపెట్టాడు. 6-7 నెలల పాటు సుమారు 3000 కిలోమీటర్ల దూరం నడవనున్నాడు జగన్. అయితే తొలి అడుగుతోనే వైకాపా శ్రేణులలో నైరాశ్యం ఆవహించింది. పాదయాత్రను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ తన సొంత ఇలాకా ఇడుపులపాయ నుండే పాదయాత్ర మొదలు పెట్టారు.
లక్ష మందిని సమీకరించి భారీగా బలప్రదర్శన చెయ్యాలని జగన్ ప్లాన్. ఆలా చెయ్యడం సొంత జిల్లాలో అయితే తేలిక. కాకపోతే ముందు వేసిన అంచనాలు అన్ని తారుమారు అయ్యాయి. లక్ష మందికి అంచనా వేస్తే వచ్చింది కేవలం 25000-26000 మంది మాత్రమే. కనీసం సొంత కార్యకర్తలని సమీకరించడంలో కూడా కడప జిల్లా నాయకులు విఫలం అయ్యారు.
దీని బట్టి జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి అర్ధం చేస్కోవచ్చు. మధ్యాహ్నం 50000 కోసం భోజన ఏర్పాట్లు చేస్తే భారీగా ఆహారం మిగిలిపోయింది. పాదయాత్రకు ముందు ఖర్చంతా పార్టీనే భరించనుంది అనే సమాచారం వచ్చిందట. కాకపోతే చివరి నిముషంలో స్థానిక నేతలే ఆ ఖర్చు భరించాల్సి ఉంటుందని పార్టీ తెలపడంతో వారంతా మొత్తానికి చేతులు ఎత్తేశారట.
దీనితో తొలి రోజు వచ్చిన రెస్పాన్స్ కి జగన్ తో పాటు పార్టీలోని అంతా నిరాశానిస్పృహల్లో మునిగిపోయారు. తొలి రోజే ఇలాంటి పరిస్థితి ఉంటే ఉత్సాహం సన్నగిల్లే తరువాతి రోజుల్లో ఇంకెలా ఉంటుందో అని వారు భయపడుతున్నారు. మరో వైపు గురువారం సాయంత్రం హైదరాబాద్ వెళ్లి కోర్ట్ కు హాజరు అయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


