పాదయాత్ర – సెకండ్ డే షాక్ రెడీగా ఉందా?

YS Jagan Praja Sankalpa Yatra Day 2వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన “తిట్లయాత్ర” అలియాస్ “పాదయాత్ర” మొదటి రోజున ‘పారడైజ్ పేపర్స్’ పేరుతో జగన్ కు తగిలిన షాక్ తెలిసిందే. ఓ పక్కన అవినీతి పరులను జైల్లో పెట్టిస్తాను అని జగన్ చెప్తుండగా… మరో పక్కన ఇండియాలో ఉన్న ప్రముఖ అవినీతి పరులలో జగన్ కూడా ఒకరని ‘పారడైజ్ పేపర్స్’ ధృవీకరించాయి. ఇలా తొలిరోజున ఊహించని పరిణామాన్ని ఎదుర్కొన్న జగన్ మోహన్ రెడ్డికి, రెండవ రోజు షాక్ కూడా సిద్ధంగా ఉందా? అంటే అవుననే అంటున్నాయి పొలిటికల్ వర్గాలు.

ADVERTISEMENT

గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత కిలారి రోశయ్య పార్టీని వీడెందుకు సిద్ధమయ్యారని లభిస్తున్న సమాచారం. పార్టీ నేతలు, అనుచరులతో కలిసి ఓ హోటల్ లో సమావేశమైన రోశయ్య, పార్టీ మార్పు విషయంలో తీవ్రంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పార్టీలో తనకు జరుగుతున్న అన్యాయం గురించి విశదీకరించిన కిలారి, పార్టీ మార్పుపై నేడో, రేపో ఓ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో బలంగా జరుగుతున్న ప్రచారం.

అయితే వైసీపీ నుండి నేతలు వీడిపోవడం సర్వసాధారణమే కదా… ఇందులో షాక్ ఏముంది? అనుకుంటే… ఏ సామజిక వర్గాన్ని అయితే అడ్డం పెట్టుకుని జగన్ రాజకీయ ప్రయోజనం పొందాలని భావిస్తున్నారో అదే సామజిక వర్గంకు చెందిన కిలారి రోశయ్య పార్టీని వీడడం అనేది జవాబు చెప్పుకోలేని విషయంగా మారనుంది. ఇప్పటికే ముద్రగడతో కలిసి ఏపీలో కల్లోలం చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపధ్యంలో… కిలారి రోశయ్య కూడా పార్టీని వీడితే కాపు సామాజిక వర్గాన్ని జగన్ ఏ విధంగా చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చన్న సంకేతాలు వెళ్తాయి.

ADVERTISEMENT
Latest Stories