జగన్ ది ‘షాడో’ రాజకీయమేనా.?

ysrcp-ys-jagan

ఇన్ సైడ్ ట్రేడింగ్ అంటూ స్టాక్ మార్కెట్ లో ఎక్కువగా వినిపించే పదం ఇప్పుడు జగన్ రాజకీయంలో తరుచుగా కనిపిస్తుంది. వైసీపీ అధినేతగా జగన్ వారి పార్టీ మద్దతుదారుల దృష్టిలో పులివెందుల పులిగా అభివర్ణించబడతారు. అయితే ఈ పులి కాన్సెప్ట్ వెనుక చాలపెద్ద కథే నడుస్తుంటది.

ADVERTISEMENT

కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం ఎదిరించి పోరాడిన వీరుడు, నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ని సైతం ఓడించిన సూరుడు, సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా ప్రేక్షకాధరణ పొందిన పవన్ కు సైతం పవర్ కట్ చేసిన ధీరుడు, కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలకు కూడా భయపడని బాహుబలి మా జగనన్న అంటూ జగన్ కు కెజిఫ్ రేంజ్ ఎలివేషన్లు ఇస్తుంటారు వైసీపీ శ్రేణులు.

పార్టీ కార్యకర్తల ఎలివేషన్స్ ఇలా ‘కేజిఫ్’ రేంజ్ లో ఉంటే వాస్తవానికి జగన్ మాత్రం పరదాల మాటున ‘కొమ్మరిమట్ట’ స్థాయిలో ఆలోచిస్తారు అనేది గత ఐదేళ్లలో అందరికి అవగతమైన విషయమే. జగన్ అసలు తన రాజకీయ జీవితంలో నిజంగానే ఒంటరి పోరాటం చేశాడా అంటే దానికి సమాధానం ఇప్పుడు చూద్దాం.

తన తండ్రి వైస్ రాజశేఖర్ రెడ్డి చెరిష్మాతో తన రాజకీయ జీవితానికి పునాది వేసుకున్నారు జగన్. అయితే తన తండ్రి పేరు చెప్పుకుని రాజకీయ అరంగేట్రం చేసిన జగన్ కనీసం తానూ స్థాపించిన పార్టీ అయినా సొంతంగా ఏర్పాటు చేసుకున్నారా అంటే అది కూడా ‘యువజన శ్రామిక రైతు పార్టీ’ అంటూ ఎవరో రిజస్టర్ చేయించుకున్న పార్టీని లాక్కుని తన తండ్రి పేరుకు తగ్గట్టుగా వైస్సార్ పార్టీగా ప్రజలకు పరిచయం చేసారు.

ఇక వైస్సార్ పార్టీ తరుపున ప్రజా సమస్యల మీద ఒంటరిగా పోరాటానికి దిగారా అంటే ఒక పక్క తల్లి విజయలక్ష్మి ని మరోపక్క చెల్లి షర్మిలను వెంటేసుకుని ప్రజా సమస్యల మీద కాకుండా ఓదార్పు యాత్రల పేరుతో శవ రాజకీయాలకు తెరలేపారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో తన తండ్రి వైస్సార్ ఛరిష్మా చాటున, తన తల్లి, చెల్లి పండించిన సెంటిమెంట్ మాటున జగన్ చేసింది షాడో రాజకీయం కాదా.?

ఇక ఆ తరువాత తన చిన్నాన్న వివేకాను రంగ ప్రవేశం చేయిస్తూ తన సొంత జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకున్నారు. తండ్రి పేరు చెప్పుకుని, తల్లి చెల్లిని అడ్డుపెట్టుకుని 2011 పార్టీ ప్రారంభమైన నాటి నుంచి 2019 పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే వరకు షాడో రాజకీయ చేసిన జగన్ ఆ తరువాత కూడా వందలమంది సలహాదారులను నియమించుకుని రాష్ట్రంలో వారి షాడోలో పాలన కొనసాగించారు.

అలాగే వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి అటు తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో , ఇటు బీజేపీ అగ్ర నేతలతో తెరచాటు రాజకీయం నడిపి షాడో రాజకీయాలతో ప్రభుత్వాన్ని స్థాపించారు. ఇక ఇక్కడ నుంచి రాజకీయ విశ్లేషకుల రూపంలో ఉండవల్లి వంటి వారితో ప్రత్యర్థుల మీద విమర్శలు చేయిస్తూ వారి దగ్గర నుండి షాడో మద్దతు సంపాధించారు.

ఇక సాక్షి, దాని అనుబంధ మీడియాలను అడ్డుపెట్టుకుని తమ ప్రత్యర్థుల మీద వ్యక్తిగత దాడులకు తెగ బడడం, ప్రత్యర్థి పార్టీల మీద ఫేక్ ప్రచారాలు సృష్టించడం జగన్ రాజకీయ సిద్ధాంతంగా మారిపోయాయి. అలాగే 2019 లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్ నవరత్నాల పేరుతో ‘షో’ పాలన చేసారు.

రాష్ట్రంలో ఒక్క వైసీపీ ప్రభుత్వమే సంక్షేమ కార్యక్రమాలను రూపొందించినట్టు, వాటిని సక్రమంగా అమలు చేస్తున్నట్టు, వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తూ వాటికి సంస్కరణలు అంటూ షోయింగ్ కబుర్లు చెప్పారు జగన్. దీనితో 2024 ఎన్నికలలో “జగన్ ది ‘షాడో’ రాజకీయం…వైసీపీ ది ‘షోయింగ్’ ప్రభుత్వం” గా నిర్దారింఛి ప్రజలు వైసీపీకి 11 సీట్లు ఇచ్చి తమ తీర్పును వెల్లడించారు.

ADVERTISEMENT
Latest Stories