కేంద్రంతో పార్టీలకి అతీతమైన బందం మాది: జగన్

YS Jagan Speech at Modi Public Meeting Vizagకొద్దిసేపటి క్రితం విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో ప్రధాని నరేంద్రమోడీ బహిరంగసభ ప్రారంభం అయ్యింది. ఈ సభా వేదిక ప్రధాని నరేంద్రమోడీ, రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్, సిఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆశీనులయ్యారు.

ఈ సభలో సిఎం జగన్మోహన్ రెడ్డి జనసమీకరణ చేసి తీసుకువచ్చిన ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “దేశప్రగతి రధసారధి ప్రధాని నరేంద్రమోడీకి స్వాగతం పలుకుతున్నాను. రాష్ట్రాభివృద్ధికి దోహదపడే రూ.10,742 కోట్లు విలువగల 5 ప్రాజెక్టులు ప్రారంభించేందుకు విశాఖకు వచ్చినందుకు ప్రధాని నరేంద్రమోడీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఓ వైపు మహాసముద్రం కనిపిస్తుంటే మరోవైపు ఇక్కడ జనసముద్రం కనిపిస్తోంది. ఈ జనసముద్రం చూస్తుంటే వంగపండు పాత ఏం పిల్లడో… ఎల్దమొస్తావా…’ గుర్తుకు వస్తోంది. జగన్నాథ రధ చక్రాలు కదిలివచ్చిన్నట్లు జనం కదిలివచ్చారు.

ADVERTISEMENT

కేంద్ర ప్రభుత్వంతో పార్టీలకు, రాజకీయాలకు అతీతమైన బంధం మాది. మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం తప్ప రాజకీయాలు కావని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రాష్ట్రాభివృద్ధే మా అజెండా మరో అజెండా ఉండదు ఉండబోదు. మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధికి మేము చేస్తున్న కృషిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతగానో సహాయసహకారాలు అందిస్తున్నందుకు ధన్యవాధాలు తెలియజేసుకొంటున్నాను. కేంద్ర ప్రభుత్వం అందించిన ప్రతీ ఒక్క రూపాయి రాష్ట్రంలో రాష్ట్రాభివృద్ధికి ఖర్చు చేస్తోంది నా ప్రభుత్వం.

పేదవారి ఇంటి గడప వద్దకే సకల సంక్షేమ పధకాలు తీసుకువెళ్ళి అందజేస్తున్నాము. మీ సహాయసహకారాలతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే 8 ఏళ్ళ క్రితం జరిగిన విభజన గాయాలు నేటికీ మానలేదు. ప్రత్యేక హోదా మొదలు పోలవరం ప్రాజెక్టు వరకు అనేక విభజనహామీలను పరిష్కరించాలని ఈ సందర్భంగా మరోసారి మీకు సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories