షర్మిల ఎంట్రీ తో ఏపీ రాజకీయాలు సంక్రాంతి పందెంకోళ్ల మాదిరి ఊపెక్కిస్తున్నాయి. గత ఎన్నికలలో ఇదే జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేసిన ‘వైస్ షర్మిల రెడ్డి’ ఇప్పుడు జగన్ అభిమానగళానికి ‘మొరుసుపల్లి షర్మిల శాస్త్రి’ గా మారిపోయారు. అలాగే షర్మిల కూడా ‘జగనన్న’ నుండి ‘జగన్ రెడ్డి’ అంటూ ముఖ్యమంత్రి పై తనమాటల దాడిని కొనసాగిస్తున్నారు.
రాష్ట్ర విభజన తరువాత కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీకి ఆశా జ్యోతిగా, ఆ దేవుడు పంపిన బిడ్డగా, స్టార్ కాంపైనర్ గా వచ్చిన షర్మిల పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదలు వైసీపీ కార్యకర్త వరకు ణొన్ లోకల్ పొలిటిషన్ అని,టీడీపీ స్త్ర కాంపైనర్ అని అందరూ తమతమ పరిధిలో విమర్శలు సంధిస్తున్నారు. అలాగే షర్మిల కూడా వచ్చి రాగానే జగన్ ను, వైసీపీ ప్రభుత్వాన్ని నేరుగా టార్గెట్ చేస్తూ దూసుకుపోతున్నారు.
వైస్ జగన్ మోహన్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని ‘బీజేపీ పార్టీకి తొత్తుగా’ మారిపోయారని, బీజేపీ పార్టీ కనుసన్నలలో వైసీపీ ప్రభుత్వ నడుచుకుంటుందంటూ జగన్ పై తీవ్ర విమర్శలు చేసారు షర్మిల. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రం మెడలు వంచుతాం అంటూ శపధాలు చేసిన వారు అధికారం రాగానే కేంద్ర వద్ద మెడలు వంచుకుని నిలబడ్డారని ఎద్దేవా చేసారు.
అలాగే జగన్ మోహన్ రెడ్డి కూడా షర్మిల పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తనకు తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు గొంతు విప్పినా అది చంద్రబాబు ప్లానే అంటూ చిలక పలుకులు పలికే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అదే ధోరణిలో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల చేస్తున్న విమర్శలకు గాను ఇది బాబు పన్నిన కుట్ర, చంద్రబాబు కి పక్క రాష్ట్రంలో ఉండే దత్తపుత్రుడు ఇన్నాళ్లు ఒక స్టార్ కాంపైనర్ గా ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరుపున మరో స్టార్ కాంపైనర్ ను బరిలోకి దింపారు అంటూ షర్మిల పై పరోక్ష విమర్శలకు దిగారు వైస్ జగన్.
చంద్రబాబు ని అధికారంలోకి తీసుకురావడానికి టీడీపీ తో పరోక్ష పొత్తుకు సిద్ధమయ్యారు కొందరు కాంగ్రెస్ నాయకులు అంటూ ‘షర్మిలకు టీడీపీతో పొత్తు’ సంబంధాన్ని అంటగట్టారు వైస్ జగన్. ఇలా ఏపీలో అన్నా చెల్లాల మధ్య జరుగుతున్న ఈ రాజకీయ విమర్శలను గమనిస్తున్న ఏపీ ప్రజలు మాత్రం “అన్నేమో బీజేపీ తొత్తట…చెల్లెలేమో టీడీపీతో పొత్తట”…అంతేలే “వినేవారు ఏపీ ప్రజలైతే చెప్పేవారు వైస్ కుటుంబసభ్యులవుతారు” అంటూ నోరెలాలబెడుతున్నారు.




