ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ బంపర్ ఆఫర్?

ys-jagan-padayatra-100-days-between-the-peopleనియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలకు కనీసం ఒక్క రూపాయి కూడా పార్టీ నుండి వైఎస్ జగన్ కేటాయించరని ఓ బలమైన ప్రచారం పొలిటికల్ వర్గాలలో ఉన్న విషయం తెలిసిందే. ఎవరి నియోజక వర్గాలలో ఆయా పార్టీ నేతలే ఖర్చు పెట్టుకోవాలనేది జగన్ పాలసీగా చెప్పుకుంటుంటారు. అలాంటి జగన్ తొలిసారిగా తన పార్టీ ఎమ్మెల్యేలకు ఓ బంపర్ ఆఫర్ ను ప్రకటించబోతున్నారని జరుగుతోన్న ప్రచారం.

ADVERTISEMENT

రాజ్యసభ ఎన్నికల నేపధ్యంలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితులలో చేజారిపోకుండా ఉండేందుకు క్యాంపు రాజకీయాలకు వైసీపీ సిద్ధమయ్యిందనేది లేటెస్ట్ న్యూస్. ఇందులో భాగంగా తన పార్టీ ఎమ్మెల్యేలను విదేశాలకు పంపి, అధికార టిడిపితో టచ్ లో లేకుండా చేయాలనేది వైసీపీ వ్యూహంగా మీడియా వర్గాలలో ప్రసారమవుతోన్న కధనాలు. అలాగే టిడిపి మూడో అభ్యర్ధిని నిలబెడితే కూడా ఏం చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారట.

మొత్తానికి మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న నేపధ్యంలో… ముందుస్తుగా వచ్చిన రాజ్యసభ ఎన్నికల కోసం కాస్త గట్టిగానే ఖర్చు పెట్టేందుకు జగన్ సిద్ధమవ్వడం చెప్పుకోదగ్గ పరిణామంగా పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్యాంపు రాజకీయాలు అనేవి కొత్తేమీ కాదులే… అధికారంలో ఉన్న పార్టీల నుండి కాపాడుకునేందుకు ప్రతిపక్షాలు ఎప్పుడూ అనుసరించేవే! అయితే జగన్ కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధం కావడమే ప్రస్తుతం హైలైట్ అయ్యేలా చేస్తోంది.

ADVERTISEMENT
Latest Stories