రెండు రాష్ట్రాల ప్రజలకు షర్మిల క్షమాపణ చెప్పాల్సిందేనా..?

YS-Jagan_Rahul-Gandhi

YSRTP పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్న షర్మిల పై ఫైర్ అయ్యారు టీడీపీ నేత ఆనం. షర్మిల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను మోసం చేసి తన రాజకీయ అవసరాల కోసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అంటూ మండి పడ్డారు.

అలాగే 2011 మార్చి 11 న కాంగ్రెస్ పార్టీ తమకు తమ కుటుంబానికి అన్యాయం చేసినదంటూ కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా ఏపీలో “యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ” (వైసీపీ) ని ఏర్పాటు చేశారు వైస్ జగన్.

ADVERTISEMENT

అన్న వెంటే తన పయనం అంటూ షర్మిల కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర విమర్శలు చేసి అన్యాయంగా తన అన్నను కాంగ్రెస్ అధిష్టానం జైలుకి పంపిందని, అలాగే ఆ ఛార్జ్ షీట్ లో తన తండ్రి వైస్సార్ పేరును కూడా చేర్చి వైస్సార్ కుటుంబాన్ని రోడ్డు మీదకు తీసుకురావాలని ప్రతిపక్షాలతో కలిపి గాంధీ కుటుంబం కుట్ర పన్నిందంటూ తల్లి, చెల్లి,అన్నకలిసి ఏపీ ప్రజలను నమ్మించి మోసం చేసారు అంటూ ఆనం నాన యాగీ చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది, తండ్రి లేని బిడ్డను ఇబ్బందులు పాలు చేసింది, జగనన్న వదిలిన బాణాన్ని అంటూ 2014 అబద్దాలను నుండి ప్రచారం చేసుకుని ప్రజల సానుభూతిని పొంది అధికారం దక్కించుకున్నారు.

ఇప్పుడు 12 సంవత్సరాల తరువాత వచ్చి కాంగ్రెస్ పార్టీ లో చేరి రాహుల్ ను దేశ ప్రధానిగా చేయాలి అనే తన తండ్రి చివరి మాటలను నెరవేర్చడానికి తనవంతు కృషి చేస్తాను అంటూ తిరిగి ఏపీ రాజకీయాల వైపు చూస్తున్న వైస్ షర్మిల ఖచ్చితంగా తానూ చెప్పిన అబద్ధాలకు, చేసిన మోసాలకు ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే అన్నారు.

తెలంగాణ రాజకీయాలలో కాలు పెట్టి నాకు ఏపీ రాజకీయాలతో సంబంధం లేదు, నేను ఆడ పిల్లను కాదు ఈడ పిల్లను అంటూ ఏపీ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన షర్మిల ముందుగా ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ నిలదీస్తున్నారు ఆనం.

అలాగే తెలంగాణ కోడలు గా తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తాను అంటూ రెండేళ్లు పాదయాత్రలతో కాలం గడిపి ఎన్నికలు వచ్చేసరికి కేసీఆర్ ఓటమి కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి తమ పార్టీ త్యాగం చేసింది అంటూ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను, తెలంగాణ ప్రజలను మోసం చేసి ఇప్పుడు అత్తారిల్లు కాదు పుట్టిల్లే ముఖ్యం అంటూ మాట మార్చి మడం తిప్పిన మరో వైస్సార్ బిడ్డ షర్మిల అటు తెలంగాణ ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ సీనియర్ నేత ఆనం.

ADVERTISEMENT
Latest Stories