నిష్ప్రయోజనమని తెలిసినా చెల్లి ప్రయత్నిస్తుంటే…

Kavitha continues political efforts

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీని కలిసి వచ్చారు. విజయవాడ తిరిగి వచ్చిన తర్వాత ప్రెస్‌మీట్‌ మహాత్మాగాంధీ ఉపాధి హామీ పధకాన్ని యధాతధంగా అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ త్వరలోనే పాదయాత్ర చేపట్టబోతున్నట్లు ప్రకటించారు.

ఆమెకు పాదయాత్రలు కొత్తకాదు. కనుక అధిష్టానం సూచన మేరకు మరోసారి పాదయత్రకి సిద్ధమవుతున్నారని అర్ధమవుతూనే ఉంది. గతంలో జగన్‌ కోసం ఆమె పాదయాత్రలు చేస్తే వైసీపీ బలపడింది. అన్న ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ ఇప్పుడు ఆమె ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రయోజనం ఉండదని 2024 ఎన్నికలలోనే తేలిపోయింది.

ADVERTISEMENT

ఒకవేళ ఆమె ఈ రెండేళ్ళలో వైసీపీ నుంచి ఓ అరడజను మంది సీనియర్లను కాంగ్రెస్‌ పార్టీలోకి ఆకర్షించగలిగినా బలాబలాలు మారే అవకాశం ఉందని నమ్మొచ్చు. కానీ ఆమె వెనుక ఒక్క బలమైన కాంగ్రెస్‌ నాయకుడు కూడా కనబడనప్పుడు, వైసీపీ నాయకులు మాత్రం ఆమెను ఎందుకు నమ్ముతారు?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరింత బలపడుతోంది. వైసీపీ కూడా రప్పారప్పా అంటూ దూసుకుపోతోంది. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారాయి తప్ప రాజకీయ బలాబలాలో ఎటువంటి మార్పు లేదని అర్ధమవుతోంది. వచ్చే ఎన్నికలలో కూడా పోటీ వాటి మధ్యే ఉంటుంది. మరి వైఎస్ షర్మిల పాదయాత్ర దేనికి? అనే సందేహం కలుగుతుంది.

భవిష్యత్‌లో ఎప్పుడైనా ఏపీలో రాజకీయ బలాబలాలు మారితే కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం లభించకపోతుందా? అనే ఒకే ఒక్క చిన్న ఆశతోనే రాహుల్ గాంధీ షర్మిలకి ఈ పోస్టు, ఈ టాస్క్ ఇచ్చి కాలక్షేపం చేయమని కోరి ఉండవచ్చు.

ఈ పాదయాత్రతో కాళ్ళ నొప్పులు, డబ్బు ఖర్చు తప్ప మరే ప్రయోజనం ఉండదని తెలిసి ఉన్నా వైఎస్ షర్మిల సిద్ధం అవుతున్నారు. కానీ వచ్చే ఎన్నికలలో తప్పకుండా గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని బల్ల గుద్ది వాదిస్తున్న జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలస్‌ నుంచి కాలు బయటపెట్టడానికి ఇష్టపడటం లేదు. కనీసం చెల్లికున్న ఆశ, స్పూర్తి కూడా జగన్‌కు లేకపోతే వైసీపీ ఎలా అధికారంలోకి వస్తుంది?

ADVERTISEMENT
Latest Stories