విజయమ్మ కూడా కొడుకు చేసిన అన్యాయం గురించి చెప్పాల్సినవన్నీ లిఖితపూర్వకంగా చెప్పేశారు కనుక ఈ ఆస్తుల వ్యవహారం గురించి వైఎస్ కుటుంబంలో జగన్ సతీమణి భారతి తప్ప అందరూ మాట్లాడేసిన్నట్లే.
Also Read – ఈ విషయంలో జగన్‌ని నిలదీస్తే… టిడిపికే ఇబ్బంది!
చెల్లి మీద వైసీపి నేతలతో ఎదురుదాడులు చేయించిన జగన్, తల్లి మీద కూడా ఎదురుదాడి చేసేందుకు వెనకాడకపోవడం విశేషం.
అయితే తల్లి విజయమ్మపై పార్టీ నేతలతో కాకుండా ‘వైసీపి అంటోంది… వైసీపి ప్రశ్నిస్తోంది…’ అంటూ జగన్ గోడ వెనుక దాక్కొని ఎదురుదాడి చేస్తుండటం అతి తెలివి ప్రదర్శించడంగానే భావించవచ్చు.
Also Read – ఎక్కడ తగ్గాలో కూటమిలో అందరూ నేర్చుకున్నట్లేనా?
షర్మిల మీడియా సమావేశాలు పెట్టి మరీ మాట్లాడుతుంటే జగన్ తన పార్టీ నేతలు, సొంత మీడియా ద్వారా నేటికీ తెరచాటు యుద్ధాలు కొనసాగిస్తున్నారు.
విజయమ్మ లేఖ సారాంశం ప్రకారం జగన్ చెల్లికి, ఆమె పిల్లలకి ఆస్తులలో వాటా పంచకుండా మోసం చేశారు. తండ్రి పేరు చెడగొట్టి, వైఎస్ కుటుంబం పరువు తీశారు.
Also Read – విజయసాయి సూచన: వాళ్ళకి సోషల్ మీడియాని బ్యాన్ చేయాలట!
దానికి వైసీపి ముసుగులో జగన్ ఇచ్చిన సమాధాన సారాంశం క్లుప్తంగా…. ‘నా బెయిల్ రద్దు చేసి నన్ను మళ్ళీ జైలుకి పంపేందుకు షర్మిల కుట్ర చేస్తోంది. నా పరువుకి భంగం కలిగించే విదంగా మాట్లాడుతూ, నా శత్రువులతో చేతులు కలిపి నాకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తోంది. కనుక నేనే ఆమె బాధితుడిని. కానీ నువ్వు (విజయమ్మ) కూడా వాస్తవాలు దాచిపుచ్చి అసత్య ఆరోపణలు చేస్తుండటం నాకు చాలా బాధ కలిగిస్తోంది.”
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో పోరాడాలనుకున్న జగన్ ఇప్పుడు తల్లి చెల్లితో ఆస్తుల కోసం పోరాటాలు చేస్తున్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని వెనకేసుకు వచ్చినందుకు తల్లీ చెల్లి జగన్‌ని వేలెత్తి చూపారు. ఇప్పుడు ఈ ఆస్తుల వ్యవహారంలో కూడా జగన్ తమని మోసం చేశారని కుండబద్దలు కొట్టారు. అంటే ఈ పోరాటాలు కొనసాగుతున్న కొద్దీ ప్రజల దృష్టిలో జగన్ మరింత పలుచనవుతారు.
వైసీపి ముసుగులో జగన్ చేయిస్తున్న వాదనలలో పదేపదే ‘బెయిల్ రద్దు కుట్ర’ ప్రస్తావిస్తుండటం గమనిస్తే తాను జైలుకి వెళ్ళవలసి వస్తుందని జగన్ తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు స్పష్టమవుతోంది.
ఈవిదంగా ముగ్గురూ తమలో తాము కుమ్ములాడుకుంటూ తాము అత్యంత నిజాయితీపరులం అని చెప్పుకునేందుకు బహిరంగ లేఖలు వ్రాసుకుంటూ అంతులేని తమ ఆస్తుల వివరాలు బయటపెట్టుకుంటుంటే, వారి అక్రమాస్తులను చూసి ప్రజలు కూడా నివ్వెరపోతున్నారు.
కానీ అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జగన్ నైజం ఎటువంటిదో విజయమ్మ, షర్మిల ఇద్దరూ బయటపెట్టిన తర్వాత కూడా ఆయన నిర్లజ్జగా ప్రజల మద్య తిరుగుతూ నీతులు వల్లిస్తుంటే, జనాలు కూడా ఆయనకు జేజేలు పలుకుతుండటం!