వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయలక్ష్మిని గౌరవ అధ్యక్షురాలుగా నియమించిన జగన్, తల్లి ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఆ పదవికి రాజీనామా చేయించి పక్క రాష్ట్రానికి పంపిన విషయం తెలిసిందే. అయితే షర్మిలతో కలిసి తెలంగాణాలో రాజకీయాలు మొదలుపెట్టిన విజయలక్ష్మి తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైకాపా ప్రభుత్వం చేపట్టిన వైస్సార్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనడానికి ఏపీకి వచ్చారు విజయమ్మ. ఈ నేపథ్యంలో ఏపీని, తన కొడుకు జగన్ ను ఉద్దేశించి తెలంగాణలో విజయమ్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
బిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న సమయంలో కొందరు మీడియా ప్రతినిధులు ఏపీలో రాజకీయ పరిస్థితుల పై మీ స్పందన అంటూ అడగడం జరిగింది. అయితే దానికి విజయలక్ష్మి ఆ రాష్ట్రంతో మాకు పనేంటి?జగన్ కు మాకు సంబంధం ఏమిటి?అంటూ ఎదురు ప్రశ్న వేశారు.
ఇప్పుడు ఇదే వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ రాష్ట్రంతో మాకేంపని అన్న మీరు ఇప్ప్పుడు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలలో ఎలా పాల్గొంటున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఇప్పుడు మళ్ళీ తల్లిని తెర మీదకు తెచ్చాడు జగన్ అంటూ జగన్ పై కూడా పెద్దఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.
చెల్లి షర్మిలకు అవసరమున్నప్పుడు తనకు సాయం కాదుకదా మద్దతు తెలపడానికి సైతం అక్కడికి వేళ్ళని జగన్ ఇప్పుడు మాత్రం తన రాజకీయ అవసరాల కోసం మళ్ళీ తల్లి విజయమ్మను తెరమీదకు తేవడం చూస్తున్న ప్రజలు మాత్రం ‘ఆపండ్రా మీ ఫ్యామిలీ డ్రామాలు’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.




