
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని వద్దనుకున్నారు సరే! కానీ టీడీపీ అధికారంలోకి వస్తే అమరావతి నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు పదేపదే చెపుతున్నప్పుడైనా జగన్ ఆయనకు ఆ అవకాశం ఇవ్వకుండా తానే నిర్మించి ఆ క్రెడిట్ తీసుకోవచ్చు. కానీ జగన్ చాలా డిఫరెంట్!
ఒకవేళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అమరావతిలో నిర్మాణ పనులు చేయకుండా అడ్డుకునేందుకు రాజధానిలో సెంటు భూములుగా విభజించి పట్టాలిచ్చేశారు!
Also Read – కేసీఆర్ రాజకీయాలలో పాల్గొనగలరా?
ఇటువంటి జగన్ దురాలోచనలే వైసీపీ పాలిట శాపంగా మారాయని తెలిసి ఉన్నా ఆయనా మారడం లేదు. పార్టీలో నేతలు భయపడి ఆయనకు చెప్పలేకపోతున్నారు.
అందుకే జగన్ తమ సొంత మీడియాలో అమరావతిపై దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఇటీవల వైసీపీ ఆస్థాన ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి న్యూస్ ఛానల్లో కృష్ణంరాజు అనే ఓ మేధావితో ఇంటర్వ్యూ కార్యక్రమం నిర్వహించారు. దానిలో ఆయన మాట్లాడుతూ, “అమరావతి దేవతలు నివసించే ప్రాంతం కాదు. వేశ్యలకు రాజధాని. ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో వేలాదిమంది వేశ్యలున్నారు. వారి కోసం అనేక స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి కూడా. అలాంటి వేశ్యావాడలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మిస్తుండటం సిగ్గుచేటు,” అని అన్నారు.
Also Read – తల్లిపై కేసు.. తల్లికి వందనంతో మరో కేసు!
దీనిపై అమరావతిలో రైతులు, మహిళలు భగ్గు మన్నారు. తూళ్ళూరు ఉద్యమ శిబిరం నుంచి వందలాదిమంది పాదయాత్రగా బయలుదేరి తూళ్ళూరు పోలీస్ స్టేషన్‌లో సాక్షి ఛానల్, కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్ట్ కృష్ణంరాజు మీద పిర్యాదు చేశారు. వారిపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
తామందరం కూడా అమరావతిలోనే ఉంటున్నామని, కనుక అతను తమని ఉద్దేశించే ఆ విదంగా మాట్లాడారని భావిస్తున్నామన్నారు మహిళలు. సాటి మహిళలని ఉద్దేశించి ఇంత చులకనగా సాక్ష మీడియాలో మాట్లాడించినందుకు ఆ ఛానల్ అధినేత భారతి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే సాక్షి స్టూడియోలను ముట్టడిస్తామని, మహిళల గురించి అంత చులకనగా మాట్లాడిన జర్నలిస్ట్ కృష్ణంరాజుని చెప్పులతో కొట్టి గాడిదపై ఊరేగిస్తామని మహిళలు హెచ్చరించారు.
Also Read – కేసుల వలయంలో కేసీఆర్ కుటుంబం..!
సాక్షిలో ప్రసారమైన ఈ ఇంటర్వ్యూపై మంత్రి నారా లోకేష్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.