
సాధరణంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ ఎన్నికల ఖర్చును భారత ఎన్నికల సంఘానికి సమర్పించవలసి ఉంటుంది. అయితే తాజా నివేదికల ప్రకారం 2024 ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ ఎంత ఖర్చు చేసిందో చిట్టా పొద్దు బయటకొచ్చింది.
కేంద్రంలో మూడో సారి హ్యాట్రిక్ విజయాన్ని సొంత చేసుకున్న జాతీయ పార్టీ బీజేపీ 1493.91 కోట్లు ఖర్చు చేయగా బీజేపీ ప్రత్యర్థి పార్టీ అయిన మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ 620.14 కోట్లను వెచ్చించింది.
Also Read – ట్రంప్ రాజకీయాలు ఇలాగే ఉంటాయి మరి!
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, 2024 ఎన్నికలకు గాను టీడీపీ 34.25 కోట్లు ఖర్చు చేయగా, వైసీపీ 325.67 కోట్లు వెచ్చించినట్టు నివేదిక సమాచారం. అంటే వైసీపీ టీడీపీ పార్టీ కంటే 100 రేట్లు ఎక్కువ మొత్తంలో ఎన్నికల కోసం ఖర్చు చేసింది.
అయితే అత్యధికంగా ఎన్నికల కోసం డబ్బును వెచ్చించిన పార్టీలలో ప్రాంతీయ పార్టీ అయిన వైసీపీ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. అంటే వైసీపీ బిజెడి, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, బిఆర్ఎస్ పార్టీల కంటే ఎన్నికల ఖర్చులో ముందు స్థానంలో ఉండడం వైసీపీ ఆర్థిక స్థితి గతులను తేటతెల్లం చేస్తుంది.
Also Read – కమల్ హాసన్‌కి మాత్రమే న్యాయం…. చాలుగా!
వైసీపీ ఈ స్థాయిలో టీడీపీ కంటే 10 రేట్లు ఎక్కువగా ఎన్నికలలో ఖర్చు చేసినప్పటికీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమయ్యింది, టీడీపీ 134 సీట్లతో 90 % స్ట్రైక్ రేట్ తో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది.
సాధరణంగా ఎన్నికలలో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుందని, ఓటర్లు కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేసిన పార్టీల వైపే అధిక సంఖ్యలో ఆకర్షించబడతారనే ఒక నానుడి రాజకీయాలలో విస్తృతంగా ప్రచారంలో ఉండేది. అయితే వాటిని పటాపంచలు చేస్తూ ఏపీ ఓటర్లు డబ్బు కు లొంగకుండా ఏకపక్షంగా టీడీపీ కూటమి వైపు నిలబడ్డారు.
Also Read – హిందీ భాష పై బాబు స్పందన…
కేవలం ఐదు సంవంత్సరాలు అధికారంలో ఉన్న ఒక ప్రాంతీయ పార్టీ ఎన్నికల ఖర్చు విషయంలో జాతీయ పార్టీలతో పోటీ పడడం, నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న తెలుగు దేశం పార్టీ కంటే 10 రేట్లు ఎక్కువ ఖర్చు చేయడం అంటే వైసీపీ రిచ్ కాదు రిచెస్ట్ పార్టీ అనక తప్పదేమో.