YSR Congress Party Political Miscalculations

టీడీపీ అభివృద్ధి మంత్రం వైసీపీ ని ఈ స్థాయికి దిగజారుస్తుందా.? నాడు అధికారం ఉంది అనే అహంకారంతో బరితెగించిన వైసీపీ నేడు అధికారం రాదేమో అన్న భయంతో రెచ్చిపోతుందా.? అన్నట్టుగా వైసీపీ రాజకీయం నానాటికి ప్రజలలో అసహ్యభావాన్ని సృష్టిస్తుంది.

కూటమి రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపిస్తుంటే, వైసీపీ రాష్ట్ర విధ్వంశం కోసం తెగబడింది. గత ఐదేళ్ల వైసీపీ పాలనతో రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా మరో పదేళ్లు వెనక్కినెట్టబడింది. దీనితో ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఏ పార్టీ అయినా రాజధాని నిర్మాణాలను చేపట్టలేదు, ప్రజలకు ఉచిత సంక్షేమ పథకాలను సకాలంలో అందించలేదు అంటూ లెక్క వేసిన వైసీపీ అందుకు తగ్గట్టే తన ఎన్నికల హామీలను నవరత్నాలతోనే సరిపెట్టింది.

Also Read – వైసీపీలో టాప్ టూ బాటమ్ అందరూ ఇంతేనా?

అయితే నాడు అమరావతి పునర్నిర్మాణంతో పాటు సూపర్ సిక్స్, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి అంటూ ముందుకెళ్లిన కూటమి తన ఏడాది పాలనలో వైసీపీ అసాధ్యం అనుకున్న ఎన్నో పనులను కూటమి సుసాధ్యం చేసి ఆచరణలోకి తీసుకొచ్చింది. అందులో మొదటిది రాష్ట్ర రాజధానిగా అమరావతి పునర్నిర్మాణం ఊపందుకుంది.

ఇక సూపర్ సిక్స్ హామీలలో ఇప్పటికే సింహ భాగం హామీలు లబ్ధిదారుల ఖాతాలో జమయ్యాయి. ఇక రాష్ట్రానికి పెట్టుబడుల ఆహ్వానం, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఐటీ మంత్రి నారా లోకేష్ నిరంతర కృషి చేస్తున్నారు. విశాఖ ను ఐటీ హబ్ గా చేస్తూనే, రాయలసీమలో శ్రీ సిటీ విస్తరణకు ప్రణాళికలు రచిస్తున్నారు.

Also Read – రాజకీయాలలో మెట్టు దిగడం.. ఇలా కాదు!

అందులో భాగంగానే ఇటు పక్క టీసీఎస్, కాంగ్నిజెంట్ వంటి ఐటీ పరిశ్రమలతో విశాఖ,పారిశ్రామిక ప్రగతికి అడుగులు వేస్తుంటే, అటు పక్క LG, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్, డైకిన్, బ్లూ స్టార్ ఏపాక్ డ్యూరబుల్ వంటి పరిశ్రమలతో శ్రీ సిటీ విస్తరిస్తుంది. ఇక రాష్ట్ర రాజధాని అమరావతి నవ నగరాల నిర్మాణాలతో అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంది.

ఇలా ఈ మూడు ప్రాంతాలలోను వైసీపీ పాలనకు కూటమి ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపించడంతో వైసీపీ తన భవిష్యత్ పై భరోసా కోల్పోతుందా.? అందుకే ఈ రకమైన రెచ్చకొట్టే ధోరణి రాజకీయాన్ని తెరమీదకు తెస్తుందా.? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read – జగన్‌వి శవరాజకీయాలట .. ఎంత మాటనేశారు నారాయణా?

జగన్ సత్తెనపల్లి పర్యటనలో భాగంగా ఆయన కారు కింద పడి సంగయ్య అనే వ్యక్తి ప్రాణాలతో పోరాడి, సకాలంలో వైద్యం అందక చనిపోయారు. అయితే ఈ హృదయ విదారక ఘటనలో బాధితుడి పైన కనీస మానవత్వం కానీ, బాధిత కుటుంబం పట్ల కనీస కనికరం కానీ చూపని వైసీపీ ఫేక్ వీడియోలు, ప్రభుత్వ కుట్రలు అంటూ వితండవాదన చేస్తూ రెచ్చకొట్టే రాజకీయంతో ప్రజల ముందు మరింత దోషిగా నిలబడింది.

జరిగింది ప్రమాదమే అయినా అందుకు వైసీపీ స్పందించిన తీరు జరిగిన దారుణానికన్నా బాధాకరంగా కనిపించింది. అమరావతి అభివృద్ధికి అరాచకం అనే అడ్డు కట్టవేయాలని, ఏపీ ప్రగతికి విధ్వంశం అనే ఆయుధాన్ని అడ్డు పెట్టాలని వైసీపీ సర్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం వైసీపీ వ్యూహంలో చిక్కుకోకుండా తన పని తానూ చేసుకుంటూ ముందుకెళుతోంది.

దీనితో వైసీపీ రాజకీయం లెక్క తప్పుతుందేమో అన్న అనుమానాలు సొంత పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇదే ధోరణితో మూర్కంగా ముందుకెళ్లిన వైసీపీ వై నాట్ 175 అంటూ విర్రవీగితే ప్రజలు 11 కి పరిమితం చేసి వైసీపీ ని ఇంట్లోనే కుర్చోపెట్టారు.




నాడు ఇదే మాదిరి ఐ ప్యాక్ రాజకీయాలను నమ్ముకున్న జగన్ తనతో పాటు తన పార్టీ నేతల కళ్ళకి గెలుపు గంతలు కట్టారు. ఇప్పుడు బలప్రదర్శన పేరుతో అవే ఐ ప్యాక్ రాజకీయాలు చేస్తూ వైసీపీ శ్రేణుల ప్రాణాలు హరిస్తున్నారు. అయితే నాడు నేడు వైసీపీ లెక్క తప్పుతూనే ఉంది.