షర్మిల కు ఆస్తిలోనే కాదు అరెస్టులో కూడా వాటా.?

YSR family members Jagan and Sharmila amid ongoing asset dispute and political tensions

2019 వైసీపీ విజయంతో వైఎస్ కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కాయి. వైసీపీ గెలుపు కోసం జగన్ ముఖ్యమంత్రి పదవి కోసం జగన్, షర్మిల, విజయమ్మ కలిసి అందరు ఒక్కటై పోరాడి చివరికి అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నాక ఎవరికీ వారే యమునా తీరే అన్న చందంగా చెట్టుకొకరు పుట్టకొకరు గా చెల్లాచెదురయ్యారు.

అయితే నాటి నుంచి నేటి వరకు జగన్ – షర్మిల మధ్య సాగుతున్న ఆస్తి తగాదాలు, రాజకీయ విభేదాలకు తల్లి విజయలక్ష్మి సాక్షిగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ ఆస్తుల పంపకాల అంశం పై తాజాగా జగన్ ను ఉద్దేశించి విజయలక్ష్మి రాసిన బహిరంగ లేఖ, దాని సారాంశం పై వైసీపీ మల్లగుల్లాలు పడుతుంది.

ADVERTISEMENT

వైస్ జగన్ తన తండ్రి వారసత్వ ఆస్తిని షర్మిల పిల్లలకు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని, ఈ విషయంలో జగన్ వారికీ ఎప్పటికైనా న్యాయం చేస్తారని ఆశిస్తున్నా అంటూ విజయమ్మ రాసిన లేఖ మీద వైసీపీ నేతలు, సాక్షి మీడియా కొత్త వాదనతో తెరమీదకొచ్చారు.

వైఎస్ఆర్ ఆస్తులలో వాటా కావాలి అంటూ కోర్ట్ కెలుతున్న షర్మిలమ్మ, ఆమెకు మద్దతు పలుకుతున్న విజయమ్మ ఈ విషయంలో ప్రజలకు బదులు చెప్పాలి అంటూ, నాడు అక్రమాస్తుల కేసులో అరెస్టయ్యి జగన్ 16 నెలలపాటు జైల్లో ఉన్నారు, కానీ ఆ ఆస్తిలో వాటా కోసం అరువులు చాస్తున్న షర్మిల ఆ కేసులతో ఎటువంటి ఒత్తిడులను ఎదుర్కోవడం లేదు.

నేడు ఆస్తిలో వాటా కోరుతున్న షర్మిల మరి నాడు ఇదే ఆస్తుల కేసులో జగన్ తో పాటు ఎందుకు వాటా తీసుకోలేదు.? నాడు జగన్ అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో ఉంటే షర్మిల ఎందుకు బయటఉన్నట్టు.? తండ్రి ఆస్తిలో వాటా కోరుకునే వారు తండ్రి హయాంలో పడ్డ కేసులలో కూడా వాటా అనుభవించాలిగా.? అంటూ వైసీపీ నేతలు షర్మిల పై విజయమ్మ పై విరుచుకుపడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories