వైసీపీ 2.0 క్లారిటీ ఉంది…మరి బిఆర్ఎస్ 3.0.?

YSRCP 2.0 vs BRS 3.0: Rappa Rappa Politics Ahead?

ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ 2019 లో ఏపీ ప్రజల మనసు గెలిచిన వైసీపీ 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2024 లో అదే ప్రజల మనసు విరిచి 11 సీట్లతో ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోయింది.

అలాగే ఇక 2029 లో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే అన్న ప్రశ్నకు గాను వైసీపీ ఇప్పటి నుంచే అటు ప్రత్యర్థి కూటమి పార్టీలకు ఇటు ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తున్నారు. వైసీపీ 2.0 రప్ప రప్ప అంటూ వైసీపీ చేస్తున్న నినాదాలు ఆ పార్టీ విధి విధానాలను వివరిస్తున్నాయి.

ADVERTISEMENT

అయితే ఏపీలో వైసీపీ తెలంగాణలో బిఆర్ఎస్ మాత్రమే అధికారంలో ఉండాలి అనేలా రాజకీయాలు నడిపే బిఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తే, అంటే బిఆర్ఎస్ 3.0 అధికార పీఠం దక్కించుకుంటే అప్పుడు ఆ పార్టీ విధానాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని పై బిఆర్ఎస్ ఒక స్పష్టత ఇవ్వలేకపోతుంది.

వైసీపీ 2.0 అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వంలో పని చేస్తున్న పోలీస్ అధికారుల నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారుల వరకు, పార్టీ నాయకుల నుంచి ప్రభుత్వ మంత్రుల వరకు, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ల నుంచి పెద్దుబడిదారుల వరకు ప్రతిఒక్కరి పై రప్ప రప్ప రాజకీయాలు షురు అంటూ వైసీపీ ఇప్పటికే ప్రకటించేసింది.

మరి బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే కూడా ప్రత్యర్థి కాంగ్రెస్ పై రప్ప రప్ప రాజకీయాలు మొదలవుతాయా.? లేక బిఆర్ఎస్ అంటే గులాబీ ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ కొత్త నినాదాన్ని ఎంచుకుంటారా.?

అయితే వైసీపీ 2.0 వస్తే కూటమి తో పాటుగా చెల్లి షర్మిల మీద కూడా రప్ప రప్పా రాజకీయం మొదలవుతుందా.? అలాగే బిఆర్ఎస్ 3.0 గద్దెనెక్కితే కవిత జాగృతి కూడా తెలంగాణ టీడీపీ మాదిరి కనుమరుగుకావల్సిందేనా.?

ADVERTISEMENT
Latest Stories