వైసీపీ ‘కుల’ రక్షణ కోరుతుందా.?

YSRCP accused of using Ambati Rambabu controversy to push caste-based politics in Andhra Pradesh

వైసీపీ రాకతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కుల ప్రాధాన్యత ప్రధమ స్థానంలోకి వచ్చిందనే చెప్పాలి. ఆ పార్టీ అధినేత మొదలు కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు ప్రతి అంశంలోనూ కుల ప్రాతిపదికనే రాజకీయం చేస్తున్నారు, చేయలని చూస్తున్నారు.

అయితే తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు పై వైసీపీ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను టీడీపీ తమ్ముళ్లకు బీపిలొచ్చాయి, దాని ఫలితంగా ఇరు పార్టీల మధ్య సాగే రాజకీయ విమర్శలు కాస్త రాజకీయ దాడులుగా మారిపోయాయి.

ADVERTISEMENT

ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణుల ఆగ్రహ జ్వాలలకు వైసీపీ ఆవేశం తోడవడంతో ఒకరి పై మరొకరు విమర్శలతో విరుచుకుపడుతున్నారు, బెదిరింపులతో రెచ్చిపోతున్నారు.

అయితే ఈ మొత్తం ఎపిసోడ్ కి కర్త, కర్మ, క్రియ అయిన అంబటిని పోలీసులు అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ముందు హాజరు పరచగా కోర్ట్ అంబటికి 14 రోజుల రిమాండ్ విధించగా, పోలీస్ అధికారులు రిమాండ్ తో పాటు అంబటిని తమ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్ట్ కు విజ్ఞప్తి చేసారు.

ఇదిలా ఉంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నడిరోడ్డు మీద పోలీసుల ఎదుట, మీడియా సాక్షిగా బూతులు తిడుతూ అంబటి వేసిన వీరంగాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా జగన్ పూర్తిగా సమర్ధించారు. పార్టీ తనకు అండగా ఉంటుందంటూ ఇటువంటి బూతు రాజకీయాన్ని దగ్గరుండి ప్రోత్సహించారు.

అలాగే ఈ వివాదానికి కుల ముద్ర వేసేందుకు వైసీపీ ని సిద్ధం చేసారు. అంబటి వ్యాఖ్యల పై రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు ఆయన ఇంటి ముట్టడికి పాల్పడ్డారు, ఆ ఉద్వేగ సమయంలో విచక్షణ మరచి అంబటి ఇంటి పై కర్రలతో దాడులకు పాల్పడ్డారు.

ఈ దాడులకు వైసీపీ ఇప్పుడు ‘కుల ముద్ర’ వేసి తన పార్టీకి ‘కుల రక్ష’ కోరుతుంది. కాపు సామజిక నేత పై టీడీపీ దాడి, కాపు సామాజికవర్గం అంటే బాబు కి ఇంత చిన్న చూపా.? ఆ వర్గానికి చెందిన నాయకుల పై దాడులకు లోకేష్ పథకాలు రచిస్తున్నారు అంటూ వ్యక్తి గొడవను కుల గొడవగా చిత్రీకరించే ప్రయత్నాలు మొదలు పెట్టింది వైసీపీ.

అలాగే నాటి రంగా హత్యను నేటి అంబటి అరెస్టుతో పోల్చి చూస్తున్నారు, అదేవిధంగా ప్రచారం చేస్తున్నారు. ఇక దానికి తోడు వైసీపీ కాపు నేతలంతా మీడియా ముందుకొచ్చి ఇది కులాహంకారం, ఇది కుల గొడవే, కుల అణిచివేతే అన్నట్టుగా ఈ మొత్తం ఎపిసోడ్ కి కుల రంగు పూస్తున్నారు.

ఇది కాపు వ్యతిరేక చర్య, ఇందుకు కాపులంతా ఏకం కావలి, టీడీపీ అణిచివేతను ఎదుర్కోవాలి, కాపు నేతలను కాపాడుకోవాలి అంటూ కాపు సామాజికవర్గాన్ని రెచ్చకొట్టి వారి సామాజికవర్గం నుండి అంబటికి మద్దతుగా రక్షణ కోరుతుంది వైసీపీ.

అయితే ఇక్కడ అంబటి పై దాడిని కాపు వర్గం మీద దాడిగా చిత్రీకరిస్తున్న వైసీపీ బాబు పై చేసిన వ్యక్తిగత దాడిని కమ్మ సామాజికవర్గం మీద చేసిన దాడిగా అంగీకరించగలదా.? అంటే వైసీపీ కాపు సామజిక వర్గం నేతతో కమ్మ సామజిక వర్గం నాయకుడిని దూషించి ఆ రెండు వర్గాల మధ్య మరోసారి కుల రాజకీయ చిచ్చు రాజేయాలని చూసిందా.?

టీడీపీ, జనసేన కలయికతో వైసీపీ ఈ రెండు సామాజికవర్గాల మధ్య విద్వేషాలు రెచ్చకొట్టేందుకు ప్రతి అంశంలోకి ఈ కుల ప్రస్తావన తెస్తుంది, దాని ద్వారా టీడీపీ – జనసేనల బంధాన్ని విచ్ఛిన్నం చెయ్యాలని చూస్తుంది. అందులో భాగంగానే అంబటి ఇంటి మీద జరిగిన దాడిలోకి కాపు సామాజికవర్గాన్ని లాగి వారందరిని అంబటి మద్దతుగా రోడ్లమీదకు రమమ్ని వైసీపీ పరోక్షంగా సంకేతాలు ఇస్తుంది.

వారి మద్దతుతో తన పార్టీ అరాచకాలను రక్షించుకోవాలని చూస్తుంది. అయితే అందుకు కాపు సామాజికవర్గం సిద్ధమా అంటే కాదు అనే సంగతి వైసీపీ కూడా ఎరుకే. కానీ తనవంతు ప్రయత్నాలుగా ఇలా కుల రక్షణ కోసం వైసీపీ సోషల్ మీడియా పోస్టులు, సాక్షి మీడియా కథనాలతో వైసీపీ రెచ్చకొట్టే రాజకీయానికి తెరలేపింది.

ADVERTISEMENT
Latest Stories