జగన్ దృష్టిలో న్యాయం అవసరాన్ని, వ్యక్తిని బట్టి మారుతుందా.?

Anitha Kodikathi Counter Jagan

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా జగన్ పర్యటనలు ఎప్పుడు వార్తలలో ముఖ్యంశాలే. జగన్ తన పర్యటనలో చేసే కొన్ని ప్రసంగాలు నిత్యం వివాదాస్పదంగానే మారుతుంటాయి, సోషల్ మీడియాకు ఆహారం అవుతుంటాయి.

అయితే జగన్ కావాలనే ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతారో లేదా అవగాహనా రాహిత్యమే జగన్ ను ట్రోల్ కి గురిచేస్తుందో చెప్పలేం కానీ జగన్ బయటకొచ్చాడు అంటే సోషల్ మీడియా మీమర్స్ కి మంచి విందు భోజనం లభించినట్టే అన్న టాక్ నడుస్తుంది.

ADVERTISEMENT

అయితే తాజాగా జగన్ చేసిన విశాఖ పర్యటన అందులో ఆయన చేసిన ప్రసంగంలోని కొన్ని అంశాలు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి, అలాగే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మేటిరియల్ అయ్యాయి.

వైసీపీ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు 18 ఏళ్ళ కుమారుడు రోడ్ యాక్సిడెంట్ తో ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యాడు. దీనితో సదరు వ్యక్తి పై చట్టం తన పని తానూ చేసుకుంటూ పొతే దాన్ని తప్పుపట్టిన జగన్ ఎదో ప్రమాదాలు జరుగుతాయి, ప్రాణాలు పోతాయి,

అలాఅని18 చిన్నపిల్లోడు తెలిసో తెలియకో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ చేసి ఒక మనిషిని చంపేస్తే అందుకు ఆ చిన్నపిల్లోడి మీద హత్యా నేరం కేసు పెడతారా.? కూటమి ప్రభుత్వానికి మానవత్వం లేదా.? అంటూ బాధితుడి పక్షాన కాకుండా నిందితుడి పక్షాన వకాల్తా పుచ్చుకున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్.

అదే అంశం పై జగన్ పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో నేడు హోమ్ మంత్రి అనిత కూడా జగన్ వ్యాఖ్యల పై స్పందించారు. 18 ఏళ్ళు అయితే నేరం చేస్తే కేసులు పెట్టకూడదా.? సిదిరి వైసీపీ నాయకుడు కావడంతో ఆయన కుమారుడి నేరానికి వయస్సు మినహాయింపు వస్తుందా.?

గతంలో అదే వయస్సు లో ఉన్న కోడికత్తి శీను పై కూడా జగన్ ఎదో తెలిసో తెలియక చిన్నపిల్లాడు నేరం చేసాడు అని వదిలేశాడా.? ఆయన మీద కేసులు పెట్టి అరెస్టులు చెయ్యలేదా.? జగన్ దృష్టిలో న్యాయం అవసరాన్ని, మనిషి బట్టి మారుతూ ఉంటుందా.?

తనదాకా వస్తే ఒక న్యాయం అదే పక్కవారికైతే మరో న్యాయమా.? అంటూ అనిత జగన్ వ్యాఖ్యలకు కోడికత్తి శీను కేసుతో కౌంటర్ ఇచ్చారు. జగన్ చేస్తున్న ఇటువంటి ప్రకటనలు ఆయన పార్టీ పై సామాన్య ప్రజానీకానికి నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి అనేది జగన్ గ్రహించలేకపోతున్నారా.? అన్న ప్రశ్న జగన్ మద్దతుదారులను కూడా వెంటాడుతుంది.

ADVERTISEMENT
Latest Stories